దళితులకు అన్యాయం చేయొద్దు..


Wed,August 14, 2019 12:35 AM

సుల్తాన్‌బజార్,ఆగస్టు 13 : రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యుడు కె. రాములు పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నణ్,అధికారులు, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్,షీటీమ్స్ అదనపు డీజీ శిఖాగోయల్,జిల్లా పరిధిలోని డీసీపీలు,ఏసీపీలు,ఆర్డివోలు, ఎంఆర్‌వోలతో జాతీయ ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ బండ్లగూడ మండల పరిధిలోని గౌలిపు రా డివిజన్ పరిధిలోని ఉప్పుగూడ ప్రాంతంలోని ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో పేద ప్రజలకు ప్రభుత్వం స్థలాలను కేటాయించిందన్నారు. దళితుల స్థలాలను స్థానికేతరులకు కేటాయించారని భాగ్యనగర్ సిటీజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కానుగుల శ్రీనివాస్ తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. స్థానికులు కోర్టుకు వెళ్లడంతో కోర్టు తీర్పు కూడా స్థానికులకు కేటాయించాలని ఇచ్చినప్పటికీ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని బండ్లగూడ ఎంఆర్‌వోను నిలదీశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ తరుచుగా స్పెషల్ కోర్టు జడ్జీ బదిలీపై వెళ్లడంతో కేసుల పురోగతి మందగిస్తుందని, ఈ సమస్యను అధిగమించేందుకు రెగ్యులర్ జడ్జీని నియమించేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యుడు రాములును కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్,నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్,జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్ బాపు,అడిషనల్ డీజీపీ షిఖాగోయల్,జాయింట్ కలెక్టర్ జి రవి, జిల్లా రెవెన్యూ అధికారి భూపాల్ రెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు, ఆర్డీవో రాజాగౌడ్, జిల్లా అధికారులు, డీసీపీలు, ఏసీపీలు, తహసీల్దార్లు, వివిధ ఎస్సీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...