రూ. 2.88 లక్షలు టోకరా


Wed,August 14, 2019 12:35 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : యూట్యూబ్‌లో దుబాయ్‌లో ఉద్యోగాలంటూ వీడియో చూసి ఇద్దరు నిరుద్యోగులు మోసపోయారు. సైబర్ మాయగాళ్లు పంపి న టిక్కెట్‌లతో శంషాబాద్ విమానాశ్రయం వరకు వెళ్లి అభాసుపాలైయ్యారు. హైదరాబాద్ ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన మోహన్‌కుమార్ ప్రైవేటు ఉద్యోగి. అతడి స్నేహితుడు నాగరాజుతో కలిసి యూ ట్యూబ్‌లో ఓ వీడియో చూశారు. అందులో దుబాయ్‌లోని డీయరా షాపింగ్ మాల్‌లో రెస్టారెంట్ మేనేజర్, క్యాషియర్ పోస్టుల ఖాళీగా ఉన్నాయని వివరించారు. దీంతో మోహన్‌కుమార్ ఆ వీడియో ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబరుతో విజయ్‌కుమార్‌ను సంప్రదించారు. విజయ్‌కుమార్ పక్కహామీతో మోహన్‌కుమార్, నాగరాజులు కలిసి అతడికి ఆన్‌లైన్‌లో 2.88 లక్షలను పంపారు. నగదు తీసుకున్న తర్వాత విజయ్‌కుమార్ ఈ ఇద్దరికి వీసా, అపాయింట్‌మెంట్ లేఖలు, నివాస సౌకర్యం వివరాలు ైఫ్లె దుబాయ్ ఎయిర్‌లైన్స్ టిక్కెట్‌లను పంపాడు. దీంతో ఖుషీలో ఉన్న వీరు వాటిని తీసుకుని దుబాయ్ విమానం ఎక్కెందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.అక్కడ తనిఖీల్లో మీ విమానం సరైనవి కావని తేల్చారు. అప్పటి నుంచి విజయ్‌కుమార్‌ను ఫోన్ సంప్రదించడానికి ప్రయత్నించారు. మోసపోయామని రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...