మీ పెట్టుబడికి.. లాభం గ్యారంటీ !


Wed,August 14, 2019 12:35 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మీ పెట్టుబడికి లాభం గ్యారంటీ.. మా అనుభవంతో మీకు ట్రేడింగ్ అధిక లాభాలు వచ్చే విధంగా సలహాలు సూచనలు ఇస్తాం. అంటు ఫోన్‌లో మాటలు పలికి సైబర్ మాయగాళ్లు లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన చిట్టీ రెడ్డి వ్యాపారికి నేషనల్ స్టాక్ రిసెర్చ్ కంపెనీ నుంచి చంద్ర పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మా కంపెనీ బెంగళూరులో ఉంటుందని మేము ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టే వారికి చిట్కాలు, సలహాలు ఇస్తామని అవి కచ్చితంగా లాభాలు తెచ్చిపెడతాయని వివరించాడు. ఆ తర్వాత వివిధ పేర్లతో వరుసగా ఫోన్‌లు వస్తుండడంతో చిట్టీరెడ్డి డీ-మ్యాట్ అకౌంట్ తెరిచేందుకు సిద్ధమయ్యాడు. మేము సూచించిన షేర్స్‌లపై పెట్టుబడి పెడితే భారీ లాభాలు ఉంటాయని హామినిచ్చారు. దీనికి తోడు మా కంపెనీకి పేరొందిన ఏంజిల్ బ్రోకింగ్ సంస్థతో ఒప్పందం ఉందని కూడా నమ్మించారు. దీంతో డీ-మ్యాట్ ఖాతాకు రెడీ అయిన చిట్టీరెడ్డి వారు సూచించిన విధంగా పేటీఎమ్, క్యాష్ ఫ్రీ లింక్స్ ద్వారా మొత్తం 1.81 లక్షల రుపాయాలను జమచేశాడు. ఆ తర్వాత ఖాతా తెరవకపోవడం, లాభాలంటూ చెప్పిన నగదును డిపాజిట్ చేయకపోవడంతో చిట్టీ రెడ్డి వారిని ఫోన్‌లో నిలదీశాడు. అంతేకాకుండా అతడి సోదరుడు బెంగళూరుకు వెళ్లి చెప్పిన చిరునామా మీద గాలించాడు. కాని అక్కడ నేషనల్ స్టాక్ రిసెర్చ్ కంపెనీ కనపడలేదు. మోసపోయినట్లు భావించి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...