ప్రతాప సింగారంలోనే...భూ సమీకరణ పథకం


Tue,August 13, 2019 01:25 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఎట్టకేలకు అమల్లోకి వచ్చిన భూ సమీకరణ (ల్యాండ్ ఫూలింగ్ స్కీం) పథకం అమలుకు ప్లానిం గ్ విభాగం అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే భూ సమీకరణ పథకం నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు ల్యాండ్‌పూలింగ్‌కు ఆసక్తికనబరిచిన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందు లో భాగంగానే బాగారం, చౌటుప్పల్, ప్రతాప సింగారం నుంచి భూ యజమానులు ముందుకు వచ్చి భూ సమీకరణ పథకంలో భాగస్వామ్యం అవుతామంటూ హెచ్‌ఎండీఏను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈ మూడు ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులపై అధికారులు పథకం అమలు సాధ్యసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలి విడతలో ప్రతాపసింగారంలో భూ సమీకరణ పథకం అమలుకు వీలుగా ఉందని అధికారులు గుర్తించారు.

గతంలోనే ప్రతాప సింగారం రైతులు 440 ఎకరాల మేర భూములను హెచ్‌ఎండీఏకు ఇస్తామంటూ రావడం, దీనిపై గ్రామ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులతో హెచ్‌ఎండీఏ ఇది వరకే ఈ పథకంపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతాప సింగారం రైతులు ముందుకు రావడం, ప్రతాప సింగారంలో అధనంగా రెండు వందల ఎకరాల మేర భూమి అందుబాటులో ఉండడంతో ఈ పథకం ఇక్కడ అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం భూ సమీకరణ నోటిఫికేషన్ గడువు ఈ నెలాఖరున ముగుస్తుండడంతో ఈ పథకం అమలులో కీలకమైన కమిటీ వచ్చే వారం సమావేశం కావాలని యోచిస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రతాప సింగారంలో భూ సమీకరణ పథకం అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రతాప సింగారంతో మొదలు ..
భూ సమీకరణ పథకాన్ని తొలుత ప్రతాప సిం గారం నుంచే అమలు చేసి ప్రగతికి బాటలు వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో లే అవుట్ చేయడం ద్వారా ఇరువురికి లాభదాయకంగా ఉంటుందని నిర్ణయించి అధికారులు ఇక్కడ అమలుకు కసరత్తు చేస్తున్నారు. నాగోలు - కొర్రెముల ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు గల 12 కిలోమీటర్ల దూరం మేర రూ. 400 కోట్లతో వందమీటర్ల వెడల్పుతో రోడ్డు పనులు చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్ సిద్ధంగా ఉందని, ఈ రోడ్డు పక్కన మూసీ పొడవునా ప్రతాప సింగారం భూములు ఉండడంతో లే అవుట్‌కు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడి భూముల రేట్లు రెండు విధాలుగా ఉన్నాయని, రైతులు ముందుకు రావడంతో నిర్ణీత గడువులోగా లే అవుట్ అభివృద్ధిని పూర్తి చేయవచ్చని యోచిస్తున్నారు. దాదాపుగా ఈ వెంచర్ ద్వారా సంస్థకు దాదాపుగా రూ. 800 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని త్వరలోనే కమిషనర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ పథకం అమలుపై స్పష్టత రానుందని అధికారులు తెలిపారు.

కాగా అన్నింటికంటే మించి అభివృద్ధిలో భూయజమానులు భాగస్వామ్యం అవుతారని, ఈ పథకంలో చేరితే తాను ఇచ్చిన భూమిని సమానమైన భూమిని పొందడంతో పాటు నివాస యోగ్యమైన ప్రపంచ స్థాయి మౌలికవసతులతో కూడిన ప్లాట్లు దక్కనున్నాయని తెలిపారు. ఐక్యతతో ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సభల ద్వారా వివరించడం జరిగిందని అధికారులు తెలిపారు. భూములు కోల్పోకుండా అభివృద్ధి పథకంలో యాజమానులు భాగస్వామ్యం అయితే ప్రణాళికబద్ధ్దమైన అభివృద్ధికి అస్కారముంటుందని, అభివృద్ధ్ది పరిచిన ప్లాట్లు దక్కడంతో పాటు నిర్థారిత వాటాల ప్రకారం భూమిని కేటాయించడం జరుగుతుందని చెబుతూ ఈ పథకంలో భాగస్వామ్యం చేస్తుండడం గమనార్హం.

గ్రేటర్‌లో పలు చోట్ల జల్లులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సోమవారం గ్రేటర్‌లో చిరుజల్లులు కురిశాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 1.9సెం.మీ, కూకట్‌పల్లి గాజులరామారంలో అత్యల్పంగా 5.3మి.మీల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లో తేలికపా టి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించారు.
ప్రతాప సింగారంలోనే..
భూ సమీకరణ పథకం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఎట్టకేలకు అమల్లోకి వచ్చిన భూ సమీకరణ (ల్యాండ్ ఫూలింగ్ స్కీం) పథకం అమలుకు ప్లానిం గ్ విభాగం అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే భూ సమీకరణ పథకం నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు ల్యాండ్‌పూలింగ్‌కు ఆసక్తికనబరిచిన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందు లో భాగంగానే బాగారం, చౌటుప్పల్, ప్రతాప సింగారం నుంచి భూ యజమానులు ముందుకు వచ్చి భూ సమీకరణ పథకంలో భాగస్వామ్యం అవుతామంటూ హెచ్‌ఎండీఏను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈ మూడు ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులపై అధికారులు పథకం అమలు సాధ్యసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలి విడతలో ప్రతాపసింగారంలో భూ సమీకరణ పథకం అమలుకు వీలుగా ఉందని అధికారులు గుర్తించారు. గతంలోనే ప్రతాప సింగారం రైతులు 440 ఎకరాల మేర భూములను హెచ్‌ఎండీఏకు ఇస్తామంటూ రావడం, దీనిపై గ్రామ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులతో హెచ్‌ఎండీఏ ఇది వరకే ఈ పథకంపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతాప సింగారం రైతులు ముందుకు రావడం, ప్రతాప సింగారంలో అధనంగా రెండు వందల ఎకరాల మేర భూమి అందుబాటులో ఉండడంతో ఈ పథకం ఇక్కడ అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం భూ సమీకరణ నోటిఫికేషన్ గడువు ఈ నెలాఖరున ముగుస్తుండడంతో ఈ పథకం అమలులో కీలకమైన కమిటీ వచ్చే వారం సమావేశం కావాలని యోచిస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రతాప సింగారంలో భూ సమీకరణ పథకం అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రతాప సింగారంతో మొదలు ..
భూ సమీకరణ పథకాన్ని తొలుత ప్రతాప సిం గారం నుంచే అమలు చేసి ప్రగతికి బాటలు వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో లే అవుట్ చేయడం ద్వారా ఇరువురికి లాభదాయకంగా ఉంటుందని నిర్ణయించి అధికారులు ఇక్కడ అమలుకు కసరత్తు చేస్తున్నారు. నాగోలు - కొర్రెముల ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు గల 12 కిలోమీటర్ల దూరం మేర రూ. 400 కోట్లతో వందమీటర్ల వెడల్పుతో రోడ్డు పనులు చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్ సిద్ధంగా ఉందని, ఈ రోడ్డు పక్కన మూసీ పొడవునా ప్రతాప సింగారం భూములు ఉండడంతో లే అవుట్‌కు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడి భూముల రేట్లు రెండు విధాలుగా ఉన్నాయని, రైతులు ముందుకు రావడంతో నిర్ణీత గడువులోగా లే అవుట్ అభివృద్ధిని పూర్తి చేయవచ్చని యోచిస్తున్నారు. దాదాపుగా ఈ వెంచర్ ద్వారా సంస్థకు దాదాపుగా రూ. 800 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని త్వరలోనే కమిషనర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ పథకం అమలుపై స్పష్టత రానుందని అధికారులు తెలిపారు. కాగా అన్నింటికంటే మించి అభివృద్ధిలో భూయజమానులు భాగస్వామ్యం అవుతారని, ఈ పథకంలో చేరితే తాను ఇచ్చిన భూమిని సమానమైన భూమిని పొందడంతో పాటు నివాస యోగ్యమైన ప్రపంచ స్థాయి మౌలికవసతులతో కూడిన ప్లాట్లు దక్కనున్నాయని తెలిపారు. ఐక్యతతో ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సభల ద్వారా వివరించడం జరిగిందని అధికారులు తెలిపారు. భూములు కోల్పోకుండా అభివృద్ధి పథకంలో యాజమానులు భాగస్వామ్యం అయితే ప్రణాళికబద్ధ్దమైన అభివృద్ధికి అస్కారముంటుందని, అభివృద్ధ్ది పరిచిన ప్లాట్లు దక్కడంతో పాటు నిర్థారిత వాటాల ప్రకారం భూమిని కేటాయించడం జరుగుతుందని చెబుతూ ఈ పథకంలో భాగస్వామ్యం చేస్తుండడం గమనార్హం.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...