సైబరాబాద్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ


Tue,August 13, 2019 01:23 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న 20మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లను బదిలీచేశారు. ఈ మేరకు కమిషనర్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీల్లో భాగంగా వీ. సుధీర్‌కుమార్‌ను సీసీఎస్ నుంచి కూకట్‌పల్లి డీఐగా, బీ.జానయ్యను సీపీఓ నుంచి శంషాబాద్ సీపీఓగా బదిలీచేశారు. అలాగే ఎన్.తిరుపతిని సీపీఓ నుంచి డీఐ షాద్‌నగర్‌గా, జి.విజయ్‌భాస్కర్ రెడ్డిని సీపీఓ నుంచి సీసీఎస్‌కు, జి.గురవయ్యను సీపీఓ నుంచి గచ్చిబౌలికి, ఎం.సోమనాథంను గచ్చిబౌలి నుంచి సీపీఓకు, వి.రామకృష్ణను సీపీఓ నుంచి సీసీఆర్‌బీకి, ఎం.రవీందర్‌రెడ్డిని అల్వాల్ ట్రాఫిక్ నుంచి సీసీఎస్‌కు బదిలీచేశారు. అలాగే జీ.నర్సయ్యను కూకట్‌పల్లి ట్రాఫిక్ నుంచి షాబాద్‌కు, ఎ.సత్యనారాయణను గచ్చిబౌలి నుంచి సీసీఎస్‌కు, ఎన్.బోస్‌కిరణ్‌ను రాజేంద్రనగర్‌నుంచి కూకట్‌పల్లి ట్రాఫిక్‌కు, టి.నర్సింగ్‌రావును కూకట్‌పల్లి ట్రాఫిక్ నుంచి అల్వాల్ ట్రాఫిక్‌కు, ఎస్.సునిల్‌ను షాద్‌నగర్ ట్రాఫిక్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి డీఐగా, పీ.రామచందర్‌రావుకు సీపీఓ నుంచి సీసీఎస్‌కు స్థానచలనం కల్పించారు.

సీహెచ్ బాలకృష్ణను చేవెళ్లనుంచి ఎస్‌హెచ్‌ఓ చేవెళ్లకు, బీకిషన్‌కుమార్‌ను బాలానగర్ నుంచి ట్రాఫిక్‌కు, ఎండీ వాహెదుద్దీన్‌ను ట్రాఫిక్‌నుంచి బాలానగర్‌కు, ఎ.గంగారెడ్డిని స్పెషల్ బ్రాంచ్‌నుంచి జగద్గిరిగుట్టకు, కె.శ్రీనివాసులును జగద్గిరిగుట్ట నుంచి సీపీఓకు, ఎన్.చంద్రబాబును శంషాబాద్ నుంచి కొత్తూరుకు బదిలీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కమిషనర్ స్పష్టం చేశారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...