అనుమానం పెనుభూతమై...


Tue,August 13, 2019 01:21 AM

మెహిదీపట్నం : అనుమానం పేనుభూతమై... భార్యను గొంతుకోసం దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం... గోల్కొండ మోతీ దర్వాజ ప్రాంతంలో నివసించే బషీర్ (42) డ్రైవర్. ఇతను సమీరా బేగం (37)ను రెండో భార్యగా చేసుకున్నాడు. అయి తే ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి.

ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అనుమానం పెనుభూతమై ఆదివారం అర్ధరాత్రి భార్య సమీరాను గొం తు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. సోమవారం మధ్యా హ్నం బషీర్ పోలీసులకు ఫోన్‌చేసి తన భార్యను గొంతు కోసి చంపానని చెప్పాడు. వెంట నే ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి బృందంతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...