మరో మూడు రోజుల్లో విద్యార్థి మృతదేహం


Tue,August 13, 2019 01:20 AM

-మృతుడి కుటుంబ సభ్యుల వెల్లడి
సుల్తాన్‌బజార్ : ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన విద్యార్థి.. అక్కడి పార్కులో మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృత దేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. నగరంలోని నాంపల్లి భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాజేందర్‌సింగ్ భాటి యా, జస్‌ప్రీత్ కౌర్ దంపతుల కుమారుడు జస్‌ప్రీత్ సింగ్ భాటియా ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లాడు. గత శనివారం అక్కడి నుంచి నగరానికి రావల్సి ఉంది. అయితే కొన్ని గంటల్లోనే అక్కడి ఫియో ఫానియా పార్కు నదిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. కాగా.. మృతదేహం నగరానికి చేరుకోవడానికి ఇంకా మూడు రోజుల సమయం పడుతుందని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. వారిని కుటుంబ సభ్యులు, బంధువులు పరామర్శించి ఓదారుస్తున్నారు. చేతికి అందిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. పుట్టిన రోజునాడే జస్‌ప్రీత్‌సింగ్ మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...