అతివేగం ప్రాణం తీసింది...


Tue,August 13, 2019 01:19 AM

శేరిలింగంపల్లి : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య చెల్లెలు మనుమడు నగరంలోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా, హన్మకొండ టీచర్స్ కాలనీలో నివాసం ఉండే తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య చెల్లెలు మాధవి, కరుణాకర్ దంపతుల కుమారుడు కొడూరి ధృపద్ (22) నగరంలోని ఖాజగూడలో ప్రైవేట్ ఫెయింగ్ గెస్ట్ హాస్టల్‌లో నివసిస్తున్నాడు. మాదాపూర్‌లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చదువుతున్నాడు. కాగా... సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో హాస్టల్‌లో ఉండే స్నేహితుడు కృష్ణ చైతన్యను నానక్‌రాంగూడ ఐటీ కారిడార్‌లోని క్యూసిటీ ఐటీ పార్క్ సమీపంలో దించేందుకు తన పల్సర్ వాహనం(టీఎస్03ఈక్యూ8223)పై బయలుదేరాడు.

కృష్ణ చైతన్యను దించి తిరుగుప్రయాణంలో క్యూసిటీ నుంచి విప్రో సర్కిల్ వైపు వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. బైక్ పల్టీలు కొట్టి... విప్రో సర్కిల్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారులకు ఢీకొంది. ఈ ఘటనలో దృపద్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అం దించారు. రోడ్డు ప్రమాద ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. బైక్‌ను వేగంగా నడపడంతో ఆది విప్రో సిగ్నల్ వద్ద కంట్రోల్ కాక పక్కనే ఉన్న డివైడర్‌కు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...