వన్‌మైల్ రన్..


Mon,August 12, 2019 03:11 AM

-ఉల్లాసంగా వన్‌మైల్ రన్.
- జుంబా డ్యాన్స్‌తో హోరెత్తించిన మంత్రి మల్లారెడ్డి

కంటోన్మెంట్, ఆగస్టు 11(నమస్తేతెలంగాణ): వన్‌మైల్ రన్ ఉల్లాసంగా సాగింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విద్యార్థులతో రన్‌లో పాల్గొని జోష్‌ను నింపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త(మంత్రి మల్లారెడ్డి తండ్రి) చామకూర మల్లారెడ్డి 21వ వర్దంతిని పురస్కరించుకొని సీఎంఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన వన్‌మైల్ రన్‌కు విశేష స్పందన వచ్చింది. దాదాపు వెయ్యి మంది విద్యార్థులు రన్‌లో పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు బోయిన్‌పల్లిలోని కంటోన్మెంట్ క్రీడా మైదానంలో మంత్రి మల్లారెడ్డి జెండా ఊపి వన్‌మైల్ రన్‌ను ప్రారంభించారు. ఈ రన్ శ్రీలత గార్డెన్, పుల్లారెడ్డి చౌరస్తా మీదుగా మల్లారెడ్డి గార్డెన్ వరకు సాగింది. విద్యార్థులను రెండు వేర్వేరు గ్రూపులకు విభజించి రన్‌లో పాల్గొన్న మొదటి పది మందికి బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు.

విద్యార్థుల్లో జోష్ నింపిన మంత్రి
వన్‌మైల్ రన్‌లో భాగంగా కార్మిక శాఖ మంత్రి విద్యార్థులతో పాటు పరుగెత్తారు. గార్డెన్స్‌లో ఏర్పాటు చేసి జుంబా డ్యాన్స్‌లో పాల్గొని హుషారెత్తించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ దైనందిన జీవితంలో వ్యాయమాన్ని భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. యాంత్రిక జీవన విధానంలో ఔట్‌డోర్ క్రీడలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్రీడాస్ఫూర్తిని వారిలో పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సాదాకేశవరెడ్డి, పాండుయాదవ్, శామీర్‌పేట జడ్పీటీసీ సభ్యురాలు అనిత, ఎంఎల్‌ఆర్ విద్యా సంస్థల అధినేత మర్రి లక్ష్మన్‌రెడ్డి, సీఎంఆర్ విద్యా సంస్థల ఉపాధ్యక్షుడు చామకూర నర్సింహరెడ్డి, సెక్రటరీ కరస్సాండెంట్ చామకూర గోపాల్‌రెడ్డి, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మేనేజింగ్‌డైరెక్టర్ చామకూర మహేందర్‌రెడ్డి, మెడికల్ కళాశాలల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భద్రారెడ్డి, శ్రీశైలంరెడ్డి, సీఎంఆర్ పాఠశాల డైరెక్టర్ ఎస్.కె.రెడ్డి, ప్రిన్సిపాల్స్ నాగేశ్వరి, లిజెబెనెడిక్ట్ నాయకులు భానుక మల్లీకార్జున్, ప్రభుకుమార్‌గౌడ్, ఎన్‌ఎల్‌ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...