కిమ్స్‌లో చికిత్స పొందుతూ యువకుడు మృతి


Mon,August 12, 2019 03:04 AM

బేగంపేట్, ఆగస్టు 11: రోడ్డు ప్రమాదంలో గాయపడి గత మూడు వారాలుగా సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కాగా ఆదివారం ఉదయం వరకు రూ. 7 లక్షలు చెల్లించారు. అయితే బిల్లులో మిగిలిన రూ. 3 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకుపోవాలని సిబ్బంది స్పష్టం చేశాయి. దీంతో మృతుడి బంధువులు అంతా చందాలు పోగు చేసుకుని లక్ష చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బంధువుల కథనం ప్రకా రం.. కామారెడ్డి పిట్ల మండలం గూడేగావ్‌కు చెందిన సంతోష్ (23)కు 3నెలల క్రితం వివాహమైంది. బతుకుదెరువు కోసం గత నెల నగరానికి వచ్చి పటాన్‌చెరులో నివాసముంటూ మాదాపూర్‌లోని ఓ హెయిర్ కటింగ్ సెలూన్‌లో దినసరి వేతనంపై పని చేస్తుండగా, గత నెల 24వ తేదీ రాత్రి ఇస్నాపూర్ వద్ద ఓ టిప్పర్ ఢీకొంది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంతోష్ కిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. శనివారం రాత్రి వరకు కూడా సంతోష్ కోలుకుంటున్నాడని, త్వరలోనే అతడిని డిశ్చార్జి చేస్తామని సిబ్బంది తెలిపారు. అయితే ఆదివారం ఉదయం బంధువుల్లో ఒక్కరు సంతోష్ వద్దకు వెళ్లి చూడగా కదలికలు లేకుండా ఉండడాన్ని గమనించి ఆందోళన చెందారు. దీంతో మృతి చెందాడని నిర్ధారించారు. అప్పటికే రూ. 7 లక్షలు చెల్లించిన కుటుంబ సభ్యులు.. మరో రూ. 3 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. అయితే కుటుంబ సభ్యులు ఆందోళనకు ఎప్పుడో మృతి చెందిన సంతోష్‌కు చికిత్సల పేరుతో కాలయాపన చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రూ. లక్ష చెల్లిస్తే మృతదేహాన్ని ఇస్తామని తెలిపారు. రూ. లక్ష చెల్లించడంతో దవాఖాన సిబ్బంది మృతదేహాన్ని బంధువులకు అప్పగించాయి.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...