ఔటర్ కూడళ్లలో పెట్రోల్ బంకులు!


Mon,August 12, 2019 03:03 AM

-తొలి విడుతలో గచ్చిబౌలి-నానక్‌రాంగూడ మార్గంలో ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ యోచన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఔటర్ ప్రయాణికుల సౌకర్యార్థం ముఖ్యమైన కూడళ్లలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది. 158 కిలోమీటర్ల మేర ఔటర్ మార్గంలో నిత్యం లక్షా ఆరు వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఔటర్‌లో ఎప్పటికప్పుడు ప్రయాణికుల డిమాండ్‌లకు అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్న అధికారులు తాజాగా వాహనంలో ఇంధనం సమస్యతో వినియోగదారులు ఇబ్బందులు పడకూడదని భావించి పెట్రోల్ బంకుల ఏర్పాటు వైపు మొగ్గు చూపారు. ఇందులో భాగంగానే ఔటర్ మొత్తంలో 19 కూడళ్ల(ఇంటర్‌ఛేంజ్‌లు)ను పరిశీలించిన అధికారులు ఇటీవల హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, ఇండియన్ భారత్ పెట్రోలియం, షేల్, ఎస్‌ఆర్ గ్రూప్, రిలయన్స్ తదితర ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో హెచ్‌ఎండీఏ అధికారులు సమావేశమయ్యారు.

హెచ్‌ఎండీఏకు సంబంధించి స్థలం అప్పగిస్తే పెట్రోల్ బంకు ఏర్పాటు మొదలు టాయిలెట్స్, ఫైర్ సెఫ్టీ, ఫుడ్‌కోర్టు, ఆటోస్పేర్ సెంటర్ తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని అధికారులు ఆయిల్ కంపెనీలకు ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు గచ్చిబౌలి-నానక్‌రాంగూడ మార్గంలో స్థలం అప్పగిస్తే పెట్రోల్ బంకు ఏర్పాటు చేయనున్నామని హెచ్‌ఎండీఏకు ప్రతిపాదనలు సమర్పించారు. త్వరలో పెట్రోల్ బంకులఏర్పాటును ఆచరణలోకి తీసుకువస్తామని, వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఔటర్‌లో మరిన్ని పెంచుతామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...