ముగిసిన ఐఎంఏ నగర శాఖ 80వ ఆవిర్భావ దినోత్సవం


Mon,August 12, 2019 03:02 AM

సుల్తాన్‌బజార్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర శాఖ ప్రారంభమై 80వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వేడుకలు ఆదివారంతో ముగిశాయి. కాగా, కోఠి ఐఎంఏ శాఖలో 80వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమంలో ఐఎంఏ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి సంజీవ్‌సింగ్ యాదవ్‌లు మాట్లాడుతూ 1939లో ఐఎంఏ సిటీ శాఖ ప్రారంభించబడి ఐఎంఏ జాతీయ కార్యాలయం పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. గత ఐదేండ్లుగా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును రద్దు చేయాలని ఐఎంఏ ప్రధాన కార్యాలయం ఇచ్చిన ప్రతి పిలుపును తెలంగాణలో ఐఎంఏ రాష్ట్ర శాఖ, నగర శాఖ సమర్థవంతంగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. కోఠి ఐఎంఏ హాల్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ శంతనుసేన్‌కు యువ వైద్య సంఘాల ప్రతినిధులు డాక్టర్ అర్జున్, డాక్టర్ మహేశ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నరేశ్, డాక్టర్ జహంగీర్‌లు నకిలీ వైద్య నిర్మూలన చట్టాన్ని తీసుకురావాలంటూ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నకిలీ వైద్యుల్లో 57.3 శాతం నకిలీ వైద్యులు క్వాలిఫికేషన్ లేనివారున్నారని, నకిలీ వైద్య నిర్మూలనా చట్టాన్ని బలమైన చట్టంగా మార్చాలని కోరారు. 80వ వసంతాల వేడుకల సందర్భంగా పలు అంశాలపై సెషన్‌లను నిర్వహించామన్నారు. వెల్త్ మేనేజ్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, క్యాన్సర్ స్కీనింగ్, ప్యానెల్ డిస్కషన్, రూల్స్ అండ్ లా ఆన్ మెడికల్ ప్రొఫెషన్, ఆర్గాన్ డొనేషన్, డిసాబిలిటి నో లాంగర్ లిమిటేషన్, హవ్ టూ అవాయిడ్ బర్న్ ఔట్ ఇన్ డాక్టర్స్, రీసెంట్ అడ్వాన్స్ ఆన్ ఆంకాలజీ, కరెంట్ స్టేటస్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ తదితర అంశాలపై ఆయా రంగాల్లోని నిష్ణాతులైన వైద్యులు సెషన్లలో భాగంగా అవగాహన కల్పించారు. ఈ ముగింపు కార్యక్రమంలో ఐఎంఏ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రవి వాంకేడ్‌కర్, డాక్టర్ వినయ్ అగర్వాల్, డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ వేదప్రకాశ్‌మిశ్రా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోశాధికారి రాజేందర్ కుమార్ యాదవ్, డాక్టర్ నర్సింగ్‌రావు, ఐఎంఏ హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు మోహన్‌గుప్తా, 80 వసంతాల వేడుకల ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ దిలీప్, ఆదిత్యా బిర్లా క్యాపిటల్ రీజినల్ హెడ్ డాక్టర్ సుతాను చక్రబోర్తి, ఇండో అమెరికన్ క్యాన్సర్ దవాఖాన డాక్టర్ సెంథిల్ జే రాజప్ప, జీవన్ ధాన్ ఇన్‌చార్జి డాక్టర్ జి.స్వర్ణలత, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ఏ రవికుమార్, అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్ డాక్టర్ మిర్జీ అత్తర్ అలీ, అపోలో దవాఖాన డాక్టర్ మనీష్ సి వర్మ తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...