ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ విభాగంలో


Mon,August 12, 2019 03:01 AM

అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ : వాడుక భాషలో ప్లాస్టిక్ సర్జరీగా పిలువబడే ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీపై తాజా అధ్యయనాలు, పురోగతిపై చర్చించేందుకు మూడు రోజులుగా సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న సదస్సు ఆదివారం ముగిసింది. అప్రాస్కాన్- 2019 పేరుతో నిర్వహించిన ఈ సదస్సులో దాదాపు వంద మంది ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నైకి చెందిన డాక్టర్ శ్రీధర్, కేరళకు చెందిన డాక్టర్ సుబ్రహ్మణ్యం అయ్యర్‌లు సామాజిక మాధ్యమాల సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ విభాగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అత్యుత్తమ వైద్య విధానాలను వైద్యులు అందిపుచ్చుకోవాలన్నారు.

శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన ప్రముఖులు ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ విభాగంలోని మైకోర వాస్క్యులర్ సర్జరీ విధానాలను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు అందుబాటులోకి తెస్తే లక్షలాది మందికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. మంత్రి ఈటల సానుకూలంగా స్పందించారని, ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని వైద్యులు పేర్కొన్నారు. ఈ సదస్సులో సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ దవాఖాన డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్, కోయంబత్తూరు డాక్టర్ కార్తికేయ, సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ, ఉస్మానియా వైద్యులు డాక్టర్ మణికుమారి, డాక్టర్ బి.లక్ష్మితోపాటు ఢిల్లీ, పుణె, థానా, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వైద్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...