అన్ని దవాఖానల్లో నేడు ఓపీ సేవలు


Mon,August 12, 2019 03:00 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా తొమ్మిది రోజులపాటు సమ్మెలో ఉన్న జూడాలు రోగుల సౌకర్యార్థం సోమవారం బక్రీద్ పండుగ సెలవుదినం రోజు అయినా ఓపీ సేవలు అందించనున్నట్లు నిమ్స్ దవాఖాన రెసిడెన్సీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డా.శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హామీ మేరకు సమ్మె విరమించిన జూడాలు సెలవురోజుల్లో సైతం వైద్య సేవలు అందించనున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలు అందించనున్నట్లు జూడాలు ప్రకటించారు. జూడాల సమ్మెతో మొన్నటి వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న రోగులకు సెలవురోజుల్లో కూడా వైద్యసేవలు అందిస్తామంటూ చేసిన ప్రకటన రోగులకు ఊరట కలిగించింది.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...