నేటి నుంచి కొరియన్ ఫిలిం ఫెస్టివల్


Mon,August 12, 2019 02:59 AM

అహ్మద్‌నగర్ : భారత్‌తోపాటు పరాయి పాలనలో మగ్గిన కొరియా దేశం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో కొరియన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. ఆదివారం సండే సినిమా ప్రదర్శనలో భాగంగా ఆయన మాట్లాడుతూ 12న ది అడ్మిరల్, 13న ట్యాక్సీ డ్రైవర్, 14న బర్న్ ది స్టేజ్, 15న బిటీఎస్ వరల్డ్ టూర్, 16న వెటరన్ సినిమాలు ప్రదర్శించబడుతాయని తెలిపారు. భారతీయ చిత్ర కథలకు దగ్గరగా ఉండే కొరియన్ చిత్ర ప్రదర్శనలను కళా ప్రియులు తప్పక వీక్షించాలని కోరారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...