నర్సింగ్‌లో చిత్తశుద్ధి అవసరం


Sun,August 11, 2019 05:17 AM

- మంత్రి ఈటల రాజేందర్
బేగంపేట: సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఎన్‌ఓఏ) ఇన్నోవేషన్ అలయన్స్ ఫర్ పబ్లిక్ హెల్త్(ఐఏపీహెచ్) సంయుక్తంగా శనివారం జాతీయస్థాయి నర్సింగ్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సింగ్ ఎంతో డైనమిక్ వృత్తి అన్నారు. చిత్తశుద్ధి, శ్రద్ధ, మానవత్వంతో చేసే ఈ వృత్తికి ఎంతో ఓపిక అవసరమన్నారు. ఈ సదస్సుకు వచ్చిన వారు తోటి వారితో, అనుభవజ్ఞులతో ఎన్నో అంశాలు నేర్చుకునేందుకు ఈ సదస్సు అవకాశం కల్పిస్తుందన్నారు. సదస్సు కన్వీనర్ కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.శీలా మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సులో పాల్గొన్న వారంతా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలని సూచించారు. కిమ్స్ దవాఖాన ఎండీ భాస్కర్‌రావు మాట్లాడుతూ సదస్సులో పాల్గొన్న వక్తలు ఈ రంగంలో విశేషమైన అనుభవం కలిగి ఉన్నారని, నర్సింగ్ వృత్తిలో తమ పరిజ్ఞానాన్ని ఇలాంటి సదస్సులో మెరుగుపర్చుకోవాలని సూచించారు. వైద్యరంగంలో మారుతున్న పరిణామాలు, అధునాతన టెక్నాలజీని ఇతర అంశాలపై పట్టు సాధించాలని సూచించారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...