సామాజిక సేవల్లో ఆర్య వైశ్యులదే అగ్రస్థానం


Sun,August 11, 2019 05:14 AM

ఖైరతాబాద్, ఆగస్టు 10 : సామాజిక సేవల్లో ఆర్య వైశ్యులు ముందు వరుసలో ఉంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాసవి సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు దివంగత కొత్తూరు సీతయ్య గుప్తా 108వ జయంతికి ముఖ్య అతిథిగా హాజరై తొలుత ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాసవి సేవా కేంద్రం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మహిళలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు, పిండి గిర్నిలను అందజేశారు. వాసవి సేవా కేంద్రాలు సేవలకు నిలయాలుగా నిలుస్తున్నాయని, 1970లో కేంద్రాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది పేద, మధ్యతగరతి, బడుగు, బలహీన వర్గాలకు వివిధ రకాలు సేవలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

పేద విద్యార్థులకు విద్యనందించడం కోసం ప్రతి ఏడాది రూ.18 లక్షలు వెచ్చించడం అభినందనీయమన్నారు. వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు కొసనగొట్టు రాజశేఖర్ గుప్తా మాట్లాడుతూ కొత్తూరు సీతయ్య గుప్తా జయంతి సందర్భంగా ఈ ఏడాది 450 మంది వృద్ధులకు పింఛన్లు, 60 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 25 మందికి వెట్ గ్రైండర్లు, ఇద్దరికి చొప్పున పిండిగిర్ని, సైకిళ్లను అందజేశామన్నారు. ఎమ్మెల్సీ రాంచంద్రారావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, వాసవి సేవా కేంద్రం ప్రధాన కార్యదర్వి రేపాక వెంకటేశ్వర్లు, కోశాధికారి కూన వెంకట గోపాలకృష్ణ, ప్రాజెక్టు చైర్మన్ వి. విఠల్ రావు, సేవా కేంద్రం జీవితకాలపు సలహాదారులు బొగ్గారపు దయానంద్, కొండ్లె మల్లికార్జున్, కూర రఘువీర్ పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...