పనిచేసే వారికే డివిజన్ కమిటీల్లో స్థానం


Sun,August 11, 2019 05:09 AM

బన్సీలాల్‌పేట్ : పార్టీ కోసం అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా టీఆర్‌ఎస్ డివిజన్ కమిటీల్లో స్థానం కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలంటే పార్టీ కార్యకర్తల ద్వారానే సాధ్యమవుతుందన్నారు.

ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీ ఆదేశాలను అమలు చేస్తూ, ప్రజల మధ్య ఉండే నాయకులకు తప్పకుండా గుర్తింపునిస్తామని తెలిపారు. అందరి ఏకాభిప్రాయంతో ప్రతి డివిజన్‌లో పోలింగ్ బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని, అలాగే డివిజన్ కమిటీలో పనిచేసే వారిని ఎన్నుకోవాలని, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను తాను ఎంపిక చేస్తానని తెలిపారు. అన్ని సామాజికవర్గాలకు సముచిత స్థానం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కుర్మ హేమలత, రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్, సనత్‌నగర్ కార్పొరేటర్ కోలన్ లక్ష్మీ రెడ్డి, బేగంపేట్ కార్పొరేటర్ ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...