ప్రధాన మంత్రి స్కాలర్‌షిప్స్ మాజీ సైనికుల పిల్లలకు వరం


Sat,August 10, 2019 04:27 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి వృత్తి విద్య కోర్సుల్లో చేరే మాజీ సైనికుల పిల్లల అవస్థలు అన్నీఇన్నీ కావు. వచ్చే కొద్దిపాటి పింఛన్‌తో భారీ ఫీజులను చెల్లించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వారికి కేంద్రీయ సైనిక్ బోర్డు ద్వారా అందజేసే ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌లు ఉపయోగపడుతున్నాయి. కోర్సులో చేరితే చాలు.. నెలకు కొంత చొప్పున నేరుగా బ్యాంక్‌ల్లో జమయ్యే ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు గడువు సమీపిస్తున్నది. అన్ని రకాల అర్హతలు, యోగ్యతల గల వారు నవంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి నోరి శ్రీనేష్‌కుమార్ తెలిపారు. కేంద్రీయ సైనికబోర్డు వెబ్‌సైట్ www.ksb.gov.in http://www.ksb.gov.in ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ వివరాలిలా ఉన్నాయి. లభించే కోర్సులు : వృత్తి విద్యాకోర్సులకు మాత్రమే (PMSS వెబ్‌సైట్‌లో నోటిఫై చేసిన కోర్సులు) బీ టెక్, బీఈ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎడ్, బీబీఏ, బీ ఫార్మా, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులుఎవరు అర్హులు : జేసీవో అండ్ అంతకంటే తక్కువ ర్యాంక్ గల వారి పిల్లలు. దరఖాస్తులకు చివరితేదీ : నవంబర్ 15, 2019 లభించే స్కాలర్‌షిప్ మొత్తం : బాలురకు నెలకు రూ. 2,500 చొప్పున ఏడాదికి రూ. 30వేలు, బాలికలకు నెలకు రూ.3వేల చొప్పున ఏడాదికి రూ. 36వేలు. నోట్ : కోర్సులో చేరిన మొదటి సంవత్సరమే స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి, మొదటి సంవత్సరం దరఖాస్తు చేసుకోకుండా, రెండో ఏడాది దరఖాస్తు చేసుకుంటే పరిగణనలోకి తీసుకోరు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...