గ్రీన్ ఛానల్‌తో గుండె తరలింపు


Sat,August 10, 2019 04:25 AM

10 నిమిషాల్లో కేర్ బంజారా టు నాంపల్లి కేర్‌కు..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి శుక్రవారం రాత్రి మనిషి గుండెను బంజారాహిల్స్ నుంచి నాంపల్లికి 10 నిమిషాల వ్యవధిలో తరలించారు. బంజారాహిల్స్‌లోని కేర్ దవాఖాన నుంచి గుండెను నాంపల్లిలోని కేర్ దవాఖానకు తరలించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ దవాఖాన వైద్యులు నగర ట్రాఫిక్ విభాగాన్ని కోరారు. దీంతో శుక్రవారం రాత్రి 8.08 గంటలకు కేర్ బంజారాలో అంబులెన్స్‌లో బతికున్న గుండెను పది నిమిషాల వ్యవధిలో నాంపల్లి కేర్ దవాఖానకు తరలించారు. ఈ సమయంలో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సాధారణ సమయాల్లో 20 నుంచి 25నిమిషాల సమయం పడుతుందని, గ్రీన్ ఛానల్‌తో పది నిమిషాల్లోనే తరలించారని నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...