సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మన మహాత్ముడు


Sat,August 10, 2019 04:25 AM

మారేడ్‌పల్లి, ఆగస్ట్టు 9 : మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు, 73వ స్వాత్రంత్ర దినోత్సవం సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మన మహాత్ముడు ఛాయాచిత్ర ప్రదర్శనను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటవ నంబర్ ప్లాట్ ఫారం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన శనివారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఛాయచిత్ర ప్రదర్శనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ చిత్ర ప్రదర్శనలో గాంధీజీ బాల్యం నుండి జరిగిన ఘటనలకు సంబంధించిన అరుదైన చిత్రాలను ప్రదర్శిస్తారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏజీఎం జాన్ థామస్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆనంద్ భాటియా, స్టేషన్ డైరెక్టర్ జయరాం, ఎం.దేవేంద్రతో పాటు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాకేశ్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఆఫీసర్ శ్రీనివాస్, జాయింట్ జనరల్ మేనేజర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, అర్చన రేచెల్, ఏసీఎం విజయ్ కుమార్, డాక్టర్ మానస్ కృష్ణకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్‌ఓబీ ఐ.హరిబాబు, కోటేశ్వర్ రావు, ఎఫ్‌పీఓ, ఆర్‌ఓబీతో సహా ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...