నీటి సంరక్షణపై లైన్‌మెన్లు దృష్టి సారించండి


Sat,August 10, 2019 04:23 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నీటి వృథాను అరికట్టడంలో లైన్‌మెన్లు కీలక బాధ్యత పోషించాలని ఎండీ దానకిశోర్ సూచించారు. నీటి సరఫరాలో ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో నీటి సంరక్షణలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఖైరతాబాద్ సంస్థ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎండీ దానకిశోర్ నీటి సంరక్షణపై లైన్‌మెన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 150 ప్రాంతాల్లో నీటి వృథా ఎలా జరుగుతుంది? ఎన్ని ఇంకుడు గుంతల నిర్మాణం జరుగుతుంది? వినియోగదారులు నల్లాపైపుతో వాహనాలు, వరండాలు కడుగుతున్నారా? అని గుర్తించాలన్నారు. వీటి అన్నింటిపై రూపొందించిన నమూనాను పూర్తి చేసి జీఎంకు నివేదిక సమర్పించాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే వాల్వూ విప్పితే ఎన్ని ఇళ్లకు నీటి సరఫరా అవుతుందో దానిని ఓ యూనిట్‌గా నీటి సరఫరా సామర్థ్యం, బిల్లింగ్ వంటి విషయాలకు ఏమైనా వ్యత్యాసం ఉందో గుర్తించాలని సూచించారు. డివిజన్‌కు ఒక ఐదు మంది లైన్‌మెన్లతో కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశాలపై చర్చించాలన్నారు. ప్రతి ఒక్క లైన్‌మెన్ తమ పరిధిలో ఒక ఇంజక్షన్ బోర్‌వెల్, ఒక ఇంకుడు గుంత నిర్మించే విధంగా కృషి చేయాలన్నారు. వీటిపై త్వరలో ఈ కమిటీలో ఉన్న 100 మంది లైన్‌మెన్లకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు శ్రీధర్ బాబు, వీఎల్ ప్రవీణ్ కుమార్‌లతో పాటు సంబంధిత ఓఅండ్‌ఎం సీజీఎం, జీఎం, లైన్‌మెన్లు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...