తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్


Sat,August 10, 2019 04:22 AM

-అధ్యక్షుడిగా నగేశ్ రంగి ఏకగ్రీవ ఎన్నిక
అబిడ్స్, నమస్తే తెలంగాణ : తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడింది. అబిడ్స్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా న్యాయవాది నగేశ్ రంగి, కార్యదర్శిగా విఠల్‌రామరాజు, కోశాధికారిగా దేవిరెడ్డిగారి వసంతకుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా పడమటి కృష్ణాగౌడ్, సిద్దంశెట్టి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా నెమ్మాని సోమేశ్వర్, కె.హుస్సేన్‌వలి, కార్యవర్గ సభ్యులుగా డి.శ్రీనివాస్ ప్రసాద్, సి.వి.సుబ్రహ్మణ్యం, నరేంద్రబాబు కాట్రగడ్డ, సింగమళ్ల సత్యనారాయణ, ఎంవీఎల్ నరసింహారావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్‌రంగి మాట్లాడుతూ అసోసియేషన్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమకు బాధ్యతలు అప్పగించిన సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సభ్యులందరికీ ఉపయోగపడే సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసి సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం సమర్పిస్తామన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...