రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో...అప్‌లోడ్ చేయడంలో నిర్లక్ష్యం తగదు


Sat,July 20, 2019 03:12 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : రైతుల సమగ్ర సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తగదని కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి జిల్లా పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడిన కలెక్టర్ రైతుల నుంచి సేకరించిన వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఆన్‌లైన్ ప్రక్రియ మొత్తం వారం రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. పంట రుణాల మంజూరు అంశంలో సంబంధిత బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకొని సత్వరమే రైతులకు రుణాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి మేరీరేఖ, ఏడీ శోభారాణి, ఏఏవోలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...