సభ్యత్వం ఇస్తాం..అండగా నిలుస్తాం.!


Thu,July 18, 2019 03:31 AM

- ఈ నెల 20తో ముగుస్తున్న గడువు.. ప్రజల నుంచి రెట్టింపవుతున్న స్పందన

పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి
- 19వ తేదీలోగా సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయండి -సమీక్షలో టీఆర్‌ఎస్ శ్రేణులకు మంత్రి తలసాని సూచన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జిలతో సభ్యత్వ నమోదుపై తలసాని సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తుందని, పేదింటి ఆడపడుచుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సంస్కృతిని ప్రతిబింబింపజేసే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం వివిధ దేవాలయాలకు నిధులను అందజేస్తున్నదని తెలిపారు. ఈ సంవత్సవం 3వేల ఆలయాలకు 15కోట్ల రూపాయలను బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అందజేస్తుందని చెప్పారు. రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ సభ్యత్వాలను ఈ నెల 19వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జిలు బండి రమేశ్, తాడూరి శ్రీనివాస్, చిరుమళ్ల రాకేశ్, విప్లవ్‌కుమార్, జిన్నారం వెంకటేశ్, బండారి లకా్ష్మరెడ్డి, తారిక్ అన్సారి, నిరంజన్‌వలి, జహంగీర్ భాష తదితరులు పాల్గొన్నారు.

తిరుగులేని శక్తి.. టీఆర్‌ఎస్
అబిడ్స్ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని పార్టీగా నిలిచిందని గోషామహల్ టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి జిన్నారం వెంకటేశ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్, ఆర్వీ మహేందర్‌కుమార్‌లు పేర్కొన్నారు. జాంబాగ్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై నాయకులు, కార్యకర్తలకు సభ్యత్వాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు ముందుకు వస్తున్నారన్నారు. బస్తీలు, కాలనీలలో చేపడుతున్న టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎస్.ధన్‌రాజ్, పి.నరేందర్‌యాదవ్, దుర్గం రాధాకృష్ణ, జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.

విస్తృతంగా చేపట్టాలి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
హైదర్‌నగర్ : పార్టీ సభ్యత్వ నమోదుకు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన నెలకొంటున్నదని, స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదుకు ముందుకు వస్తున్నారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా బుధవారం తన నివాసంలో మహిళా నేతలు కుమారి, మంజుల, ప్రసాద్, రాంబాబు, వేణు, రమేశ్, రమణయ్య, మాజీ కౌన్సిలర్ రాఘవేంద్రరావులకు క్రియా శీలక సభ్యత్వాలను ఎమ్మెల్యే గాంధీ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 20వ తేదీతో గడువు ముగుస్తున్నందున ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలన్నారు. పార్టీ నేతలంతా తమ సాధారణ, క్రియా శీలక సభ్యత్వాలను రెన్యువల్ చేయించుకోవాలని ఎమ్మెల్యే గాంధీ సూచించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే తన లక్ష్యమని , రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, చంద్రకాంత్, రాజేందర్ సహా ఇతర నేతలు పాల్గొన్నారు.

కష్టపడిన ప్రతి కార్యకర్తకు కమిటీల్లో సముచిత స్థానం
అంబర్‌పేట : పార్టీ సభ్యత్వాలను చురుగ్గా చేపట్టిన ప్రతి కార్యకర్తకు త్వరలోనే వేయబోయే కమిటీల్లో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ జంజం మసీదు వద్ద రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.సులోచన, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ ఎం.సుశీలారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభ్యత్వాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నాయకులకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 20 లోపు సభ్యత్వ నమోదును పూర్తిచేసి లక్ష్యాన్ని అధిగమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టెడి నర్సింహారెడ్డి, జె.భాస్కర్‌గౌడ్, కృష్ణాగౌడ్, ఎం.అరుణ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌గౌడ్, సుధాకర్, శ్రీరాములుముదిరాజ్, లతారావు, శ్రీను, నవీన్‌యాదవ్, స్వామి, ఇ.ఎస్.ధనుంజయ, దారయోబు, మిర్యాల రవీందర్, భాస్కర్‌గౌడ్, నరేందర్, యూసుపోద్దిన్, యాదగిరి, శివలీల పాల్గొన్నారు.

ఎక్కడికెళ్లినా.. స్వచ్ఛందంగానే..
అబిడ్స్ : సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలలో విశేష ఆదరణ ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారని గోషామహల్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి జిన్నారం వెంకటేశ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ప్రేమ్‌సింగ్ రాథోడ్‌లు పేర్కొన్నారు. గన్‌ఫౌండ్రి కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్థాయీ సంఘం సభ్యురాలు మమతాసంతోశ్‌గుప్తా ఇప్పటి వరకు పూర్తి చేసిన 5000 సభ్యత్వ నమోదు పుస్తకాలు, సభ్యత్వ రుసుమును వారికి అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారని వివరించారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నదని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ మమతాసంతోశ్ గుప్తా ఇప్పటి వరకు పూర్తి చేసిన సభ్యత్వ నమోదు పుస్తకాలను అందచేయడం పట్ల ఆమెను వారు అభినందించారు. అనంతరం మమతా సంతోశ్‌గుప్తా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...