మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల


Wed,July 17, 2019 03:25 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో ఇప్పటికే వార్డులను ప్రకటించిన అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపాలిటీల వారీగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 13 మున్సిపాలిటీలుండగా, మేజర్ గ్రామ పంచాయతీలను, నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జిల్లాలో కొత్తగా 10 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. అయితే పాత మున్సిపాలిటీల్లోనూ, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లోనూ మున్సిపల్ ఎన్నికలు తొలిసారిగా జరుగుతున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 289 వార్డులను ఏర్పాటు చేయగా, వీరి సౌకర్యార్థం సుమారు 567 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అవకాశం, అవసరం ఉన్నచోట అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా పరిధిలోని 13 మున్సిపాలిటీలలో సుమారు 5.69లక్షల ఓటర్లున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించిన కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి, వరుస సమీక్షలను నిర్వహిస్తూ ఎన్నికల నిర్వహనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...