ఆఫీసు పనివేళలు మార్చుకోవాలి


Wed,June 26, 2019 01:07 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : భారీ వర్షాలవల్ల ట్రాఫిక్‌జాం ఏర్పడుతున్న నేపథ్యంలో శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలు తమ కార్యాలయ పనివేళల్లో మార్పులు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ సూచించారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా దశలవారీగా బయటకు పంపేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతవారం కురిసిన భారీ వర్షాలవల్ల ఐటీ కారిడార్‌లో భారీగా ముంపు సమస్యతో ట్రాఫిక్‌జాం ఏర్పడిన నేపథ్యంలో మంగళవారం కమిషనర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలవల్ల ట్రాఫిక్ సమస్యలు జటిలం కాకుండా ఉండేందుకు సహకరించాలని సూచించారు. దీనిపై ఐటీ సంస్థల ప్రతినిధులు స్పందిస్తూ, పనివేళల మార్పుపై యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో కమిషనర్ ఈనెల 27న ఆయా ఐటీ కంపెనీల యజమానులతో సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో వివిధ ఐటీ సంస్థల యాజమాన్యాలే కాకుండా హైసియా, నాస్కామ్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ, సంబంధిత అధికారులు కూడా పాల్గొంటారని వివరించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...