తెలంగాణ బిడ్డ వెంకటేశ్‌కు బ్లాక్‌బెల్ట్‌లో 4వ డిగ్రీ


Wed,June 26, 2019 01:05 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ లీ మా ర్షల్ ఆర్ట్స్ చీఫ్ టెక్నికల్ డైరెక్టర్, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎడ్ల వెంకటేశ్ 2019 సంవత్సరానికి గానూ బ్లాక్‌బెల్ట్‌లో 4వ డిగ్రీ సాధించాడు. సికింద్రాబాద్‌లోని యంగ్ ఉమన్ క్రిస్టియన్ అసోసియేషన్ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో భారత గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలంగాణ నుంచి పాల్గొన్న ఏకైక వ్యక్తి ఇతడే కావడం విశేషం. చిన్నప్పటి నుంచి కరాటే అంటే అతడికి ప్రాణం. నిజామాబాద్‌కు చెందిన అతడు బ్లాక్‌బెల్ట్ 8 సార్లు సాధించి.. ప్రస్తుతం గ్రేడింగ్ పూర్తి చేసుకుని 4వ డిగ్రీ సాధించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. అవార్డును తన స్టూడెం ట్స్, తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో హెడ్ క్వార్టర్ కోచ్ రమేష్, పాషా పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...