కొనసాగుతున్న గిరీశ్ ఫిల్మోత్సవం


Wed,June 26, 2019 01:04 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దేశ వ్యాప్తంగా సాహిత్య, కళా రంగాల్లో గర్వించదగ్గ గొప్ప ప్రతిభాశాలి అయిన గిరీశ్ కర్నాడ్ మృతికి సంతాప సూచకంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఐదు రోజులపాటు గిరీశ్ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు కాడు అనే కన్నడ భాషా చిత్రాన్ని, సాయంత్రం 6:30 గంటలకు మంథన్ అనే హిందీ చిత్రాన్ని ప్రదర్శించారు. గిరీశ్ కర్నాడ్ చిత్రాలను వీక్షించేందుకు ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు, కళాకారులు ఎంతో మంది మంగళవారం పైడి జయరాజ్ థియేటర్‌కు విచ్చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి రెండు చిత్రాల ప్రదర్శన అయిపోయేంత వరకు పలువురు సినిమా ప్రేక్షకులు రవీంద్రభారతిలోని ప్రివ్యూ థియేటర్‌లో ఉన్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం 2గంటలకు స్వామి అనే హిందీ చిత్రాన్ని, ఉంబర్త అనే మరాఠి చిత్రాన్ని సాయంత్రం 6:30గంటలకు ప్రదర్శిస్తారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...