బాలల్లోని సృజనను వెలికి తీసేందుకు రుతు రాగాలు


Wed,June 26, 2019 01:04 AM

-శ్రీరాగ రమ్య నృత్య, సంగీత అకాడమీ అధ్యక్షురాలు రమ్య
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బాలల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకే రుతు రాగాలు పేరిట బాలోత్సవం నిర్వహిస్తున్నామని శ్రీరాగ రమ్య నృత్య, సంగీత అకాడమీ అధ్యక్షురాలు రమ్య అన్నారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీరాగ రమ్య నృత్య, సంగీత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రుతు రాగాలు పేర బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రుతువులు క్రమంగా కదులుతున్న వేళ, బాల బాలికల్లో కొంగ్రొత్త ఆలోచనలు, సృజనాత్మక ధోరణులు, నవీన శైలులు ఆవరించే సమయమిది.. అందుకే ఈ సృజనాత్మక కార్యక్రమానికి రుతు రాగాలు అనే పేరును పెట్టాము. పద్దెనిమిదేండ్లకు మించకుండా ఉన్న బాలబాలికలకు పలు కళల్లో రాణిస్తున్న వారికి ఒక వేదికను కల్పిస్తున్నామన్నారు.

జూలై 21న రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో పలు రకాల సాంస్కృతిక సంబురాలను నిర్వహిస్తున్నామన్నారు. సంగీతంలో జానపదం, శాస్త్రీయం, లలిత సంగీతాలు; నృత్యం లో శాస్త్రీయ, జానపదం, వెస్ట్రన్‌లు ఉన్నాయి. పై అంశాల్లో సోలోగా, బృందంగా పాల్గొనే అవకాశాలున్నాయి. సోలోగా పాల్గొనే వారికి ఆరు నిమిషాల సమయం, బృందంగా పాల్గొనేవారికి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల సమయం వ్యవధి ఉంటుందన్నారు. ఇంకా పద్యం, శ్లోక పఠనం, సోలో పాట, శ్లోకం మొదలైనవి ఆరు నిమిషాల్లో ముగించాలన్నారు. చిత్ర లేఖనానికి 30 నిమిషాల వ్యవధి ఉందన్నారు. పాల్గొనాలనుకునే ఔత్సాహికులు పేరు, జనన తేదీ, గురువు, విలాసం, మెయిల్ ఐడీ, వాట్సాప్, సెల్ నంబర్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పోటీలో పాల్గొనే వారికి ప్రవేశ రుసుముగా ఒక్కొక్కరికి రూ.500 ఉంటుందన్నారు. చిత్రలేఖనం/ పద్యం / శ్లోక పఠనంలో ఒక్కొక్కరికి రూ.200 ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ : 99639 81453, 79892 42281లలో సంప్రదించాలన్నారు. జూలై 10వ తేదీ లోగా ఉత్సాహవంతులు వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...