అర్ధరాత్రి దాటాక..దంచికొట్టింది..


Wed,June 26, 2019 01:03 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ హైదరాబాద్‌లో ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. మంగళవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం పడింది. శేరిలింగంపల్లి, మాదాపూర్, షేక్‌పేట పరిధిలో భారీ వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలో శేరిలింగంపల్లి మండల పరిధిలో 8.2 సెంటీ మీటర్ల వర్షం కురవడంతో సమీప ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జీహెచ్‌ఎంసీ వర్షాకాల బృందాలు సకాలంలో స్పందించి మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌లలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించడంతో సాఫీగా నీరు పోయి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. మాదాపూర్, హైటెక్‌సిటీ, తదితర ప్రాంతాల్లో రహదారులపై పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించడానికి అదనపు సిబ్బంది, బాబ్‌కాట్‌లను ఏర్పాటు చేశారు. రోడ్ల పరిశుభ్రతకై 30 అదనపు స్వీపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించారు. నాంపల్లి, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్, షాబాద్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 30వ తేదీన ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా 27 ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు వెంటనే తగిన చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. వివిధ ప్రాంతాలలో 10 చెట్లు కూలగ వాటిని రోడ్లపై నుంచి తొలగించామని తెలిపారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...