గులాబీ కార్యాలయాలకు.. అట్టహాసంగా శంకుస్థాపన


Tue,June 25, 2019 12:56 AM

దుండిగల్, నమస్తేతెలంగాణ: మేడ్చల్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండిమైసమ్మ-దుండిగల్ మండలం, డీ.పోచంపల్లి పరిధిలోని ఎకరం స్థలంలో నిర్మించనున్న టీఆర్‌ఎస్ కార్యాలయం భవనానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఉదయం 10ః15 గంటలకు వేదబ్రాహ్మనోత్తములతో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర ఉపాధి, కార్మిక, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, జనార్దన్‌రెడ్డి, ఎగ్గె మల్లేశంలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఏకకాలంలో 29 జిల్లాలలో పార్టీ జిల్లా కార్యాలయాలు నిర్మించడం చారిత్రాత్మకం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసిన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్టీ జిల్లా కార్యాలయాన్ని గండిమైసమ్మలో నిర్మించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించడంపై కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నేతల కోసం జిల్లా పార్టీ కార్యాలయ భవనాలను నిర్మస్తున్నట్లు తెలిపారు. దసరా పండుగనాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మేడ్చల్ జిల్లాపరిషత్ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడి ్డజిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్‌చార్జి జహంగీర్, నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజుయాదవ్‌లతో పాటు జంట సర్కిళ్ళ కార్పొరేటర్లు, జిల్లాలోని మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు,ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వివిధ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

భారీగా తరలి వచ్చిన శ్రేణులు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండిమైసమ్మ-దుండిగల్ మండలం, డీ.పోచంపల్లి పరిధిలో సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయం శంకుస్థాపన సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో శంకుస్థాపన నిర్వహించిన ప్రాంతం కార్యకర్తలతో నిండిపోయింది. పెద్దసంఖ్యలో కార్యకర్తలు వేడుకల్లో పాల్గొనడంతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొన్నది.

పోటీ పడి ఫొటోలు దిగిన కార్యకర్తలు...
ఇది ఇలా ఉండగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు మంత్రి మల్లారెడ్డితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబర్చారు. మల్లారెడ్డి సైతం ఎలాంటి అసహనం ప్రదర్శించకుండా పార్టీ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా ఫొటోలు దిగారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...