టీఆర్‌ఎస్ ఆఫీసు నుంచే కార్యకర్తలకు దిశా నిర్దేశం


Tue,June 25, 2019 12:55 AM

శంషాబాద్: నూతనంగా రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంషాబాద్ పరిధిలోని హుడా కాలనీ సమీపంలో సోమవారం భూమి పూజ ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నాయకులు కార్తీక్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. పండితులు శాస్ర్తోక్తంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ నిర్వహించారు. అలాగే కార్యాక్రమానికి స్థానిక జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైస్‌ఎంపీపీలు, ఎంపీటీసీసభ్యులు, సర్పంచ్‌లు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. శంషాబాద్ నూతన జడ్పీటీసీ నీరటి తన్వి రాజు ముదిరాజ్ ఆధ్యర్యంలో స్థానికులు శంషాబాద్ వచ్చిన మహేందర్‌రెడ్డి, అనితారెడ్డితో పాటు పలువురికి ఘనంగా స్వాగతం పలికారు. హుడా కాలనీ సమీపంలో ఉన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ వద్ద 637 సర్వే నంబర్‌లో ఎకరా భూమి కేటాయించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబన్న, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, మున్సిపాల్ అధ్యక్షుడు దూడల వెంకటేశ్, మహేందర్‌రెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్‌రెడ్డి, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ నీలంమోహన్‌నాయక్, దీపతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ప్రధాన వేదిక పార్టీ కార్యాలయం: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
వినూత్న సంస్కరణలు, అద్భుతమైన పాలనతో వరుస ఎన్నికల విజయాలతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వ విధానాలు, పథకాలు, భవిష్యత్ కార్యాచరణ, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రధాన వేదిక జిల్లా పార్టీ కార్యాలయం కాబోతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇక నుంచి నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం ప్రతి నెలా కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులకు ఇక్కడే దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కాబోతున్న పార్టీ కార్యాలయాలన్నిటిలో ప్రధానమైనది రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయమని పేర్కొన్నారు. యువనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే పలు ఐటీ, ఇతర పలు రంగాల పారిశ్రామిక సంస్థలను నెలకొల్పుతున్నారని వివరించారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజలను, పార్టీ శ్రేణులను మరింత సమన్వయం చేయడం కోసం అధిష్టానం చేపట్టే కార్యక్రమాలు ఇక్కడే కొనసాగుతాయన్నారు. పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పార్టీ కార్యాలయం అందరికి అన్ని విధాలా అనువైన శంషాబాద్ ప్రాంతంలో నిర్మించడం శ్రేయస్కరమన్నారు. త్వరలో నిర్మాణం పూర్తి చేయడానికి అన్ని విధాలా కృష్టి చేస్తామని జడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితారెడ్డి తెలిపారు. సమిష్టి సహకారం, భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చేరువలో ఉన్న రంగారెడ్డి జిల్లా కు పార్టీ కార్యాలయం ఓ ల్యాండ్‌మార్క్‌గా మారుతుందని పేర్కొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...