కళా రంగం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి గిరీష్


Tue,June 25, 2019 12:55 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/రవీంద్రభారతి : భారతదేశం సాహిత్య కళా రంగం గర్వించదగ్గ గొప్ప ప్రతిభాశాలి గిరీష్ కర్నాడ్ అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ గిరీష్ కర్నాడ్ మృతికి సంతాపంగా ఐదు రోజుల పాటు గిరీష్ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం సాయంత్రం గిరీష్ కర్నాడ్ ఫిలిం ఫెస్టివల్‌ను తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు చేతుల మీదుగా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రారంభించారు. ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో చిత్రోత్సవం ప్రారంభమైంది. ముందుగా గిరీష్ కర్నాడ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, ఫెస్టివల్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. బీఎస్ రాములు మాట్లాడుతూ, గిరీష్ తను చూసిన సామాజిక సంఘ టనలను ఇతివృత్తాలను నేపథ్యాలుగా చేసుకొని ఆయా అంశాలతో నాటకాలు, కథలు రాయడమే కాకుండా సినిమాలు కూడా తీశాడన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సంస్కృతి, కళల్ని పరిరక్షించడమే కాకుండా ఇతర రాష్ర్టాల, దేశాల సంస్కృతి కళలకు కూడా సముచిత గౌరవం అందుతుందన్నారు. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ నుంచి గిరీష్ కర్నాడ్‌కు సినీ నీరాజనంగా ఫిలిం ఫెస్టివల్ నిర్వహించడం శుభ పరిణా మమని, సంచాలకులు మామిడి హరికృష్ణను అభినందించారు. అనంతరం, మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, సినిమా కథకు సూత్రాలు ఏంటి? అనే విషయాన్ని తెలుపుతూ సినిమా కళను ఆస్వాదించి, ఆనందించే విధానాన్ని యంగ్ ఫిలిం మేకర్స్‌కు నేర్చుకోవడం కోసం క్లాసిక్ సినిమాలను పైడి జయరాజ్ థియేటర్ వేదికగా ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ వేదికలో సంగ్రహించిన సినిమా నాలెడ్జ్‌తో, టెక్నికల్ అంశాలతో ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో యంగ్ ఫిలిం మేకర్స్ తమ సినిమాలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో జ్యోత్స్న, ఒగ్గు రవి, సతీష్ కుమార్ అడ్ల, రమేష్ కిషన్, శరత్ సుంకరి, శ్రవణ్ కుమార్ ఏపూరి, ఇంకా సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తొలిరోజు సంస్కార, వంశ వృక్షం అనే కన్నడ సినిమాలను ప్రదర్శించారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కాడు (కన్నడ), సాయంత్రం ఆరున్నర గంటలకు మంథన్ (హిందీ) చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...