కేసీఆర్ కలలను నిజం చేస్తున్న గురుకులాలు


Tue,June 25, 2019 12:54 AM

ఖైరతాబాద్/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పేద విద్యార్థుల కోసం నాణ్య మైన విద్యనందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరిందని, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గురుకులాలు ఎందరో పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దుతుందని ఎలీట్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మేడి రమేష్ అన్నారు. ఖైరతా బాద్ మింట్ కాంపౌండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తి భవన్ వేదికగా బంగారు తెలంగాణ సాకారంలో సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన మేడి రమేష్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత పేద పిల్లలకు ఉచిత, నాణ్యమైన విద్యనందించాలన్న మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వందలాది గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. అలాగే కళాశాలలు, విద్యార్థినుల కోసం గురుకుల డిగ్రీ కళాశాలలను సైతం ప్రారం భించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసాను వినియోగించుకొని గురుకుల విద్యాసంస్థలు మంచి ఫలితాలు సాధించాయన్నారు. ప్రత్యేకించి సంక్షేమ గురుకులాల్లో కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ర్టాలతో పాటు ప్రపంచ వ్యాప్తంఆ ఎన్నో యూనివర్సిటీ దృష్టికి ఆకర్షించి తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాయన్నారు. సీఎం కేసీఆర్ కలలు నిజం చేయ డంలో సంక్షేమ గురుకులాల పాత్ర అద్వితీయమైనదన్నారు. సమర్థత కలిగిన ఉపాధ్యాయు లు, అధ్యాపకులు, నిబద్దతతో పనిచేసే అధికారులు గురుకులాల అభివృద్ధికి పాటుపడాలని, కేజీ టు పీజీ ఉచిత విద్య లక్ష్యాన్ని సాదించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో కత్తుల యాదయ్య, రాజారత్నం, మధు మోహన్, సమ్మ య్య, డాక్టర్ చీమ శ్రీనివాస్, ప్రమోద్, కుమారస్వామి, నెహ్రు, పల్లెల వీరస్వామి, శంకర్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...