వానొచ్చె..వరదొచ్చె


Mon,June 24, 2019 04:50 AM

-గ్రేటర్‌లో దంచికొట్టిన వాన
-జలమయమైన రహదారులు..
-తప్పని ట్రాఫిక్ తిప్పలు
-అత్యధికంగా 7.8సెం.మీల వర్షపాతం నమోదు
సిటీబ్యూరో, శేరిలింగంపల్లి: నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో గ్రేటర్లో మూడురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం జోరుగా వానపడడంతో ఇండ్లు, రహదారుల్లో వరద ఏరులైపారింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చందన్‌వల్లి, శేరిలింగంపల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, బొల్లారం, అల్వాల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో వాన నీరు రోడ్లపై నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. షాబాద్ మండలం, చందన్‌వల్లి గ్రామంలో అత్యధికంగా 7.8 సెం.మీలు, నగరంలోని జూబ్లీహిల్స్‌లో 6.6 సెం.మీల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ మోండామార్కెట్, ఖైరతాబాద్ గణాంక భవన్ ప్రాంతంలో 4.0 మి.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. రాగల మూడు రోజుల వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మాదాపూర్‌లో వరదనీరు అధికంగా నిలిచిన శిల్పారామం, నీరుస్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, ట్రాఫిక్ డీసీపీ విజయ్, టీఎస్‌ఐఐసీ డైరెక్టర్ నర్సింహారెడ్డి, బల్దియా మెయింటనెన్స్ సీఈ జియోఉద్దీన్ తదితరులు పర్యటించి..సహాయక చర్యలు పరిశీలించారు.

వర్షం పడితే..ఇవిగో ప్రత్యామ్నాయ మార్గాలు..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వర్షం కారణంగా మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో నెలకొంటున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలను జారీ చేశారు. వర్షం కురుస్తున్న సమయంలో దుర్గం చెరువు- రోడ్డు నం.45-హైటెక్ సిటీ మార్గంలో ప్రయాణాన్ని నియంత్రించుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలివి..

-హైటెక్ సిటీ-సైబర్ టవర్స్-100 ఫీట్ రోడ్డు-కావూరీ హిల్స్ జంక్షన్-నీరూస్-రోడ్డు నం.36.n హైటెక్ సిటీ-బయోడైర్సిటీ-ఖాజాగూడ-దర్గా-ఫిలింనగర్-బంజారాహిల్స్.nగచ్చిబౌలి-ఫైనిన్సియల్ డిస్ట్రిక్ట్-కొత్తగూడ-హైటెక్స్-సైబర్ టవర్స్-కావూరి హిల్స్-నీరూస్-జూబ్లీహిల్స్ రూటులో ప్రయాణించే వారు..వర్షం పడుతున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా..గచ్చిబౌలి-ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్-ఖాజాగూడ-దర్గా-ఫిలింనగర్-బంజారాహిల్స్ రూటును ఎంచుకుంటే సేఫ్.
- గచ్చిబౌలి-ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్-క్తొతగూడ-హైటెక్స్-జేఎన్‌టీయూ-కూకట్‌పల్లి నుంచి వచ్చే వాహనాలు వాన పడుతున్న సమయంలో ప్రత్యామ్నాయ మార్గంగా..గచ్చిబౌలి-కొత్తగూడ-కొండాపూర్-హఫీజ్‌పేట్-ఆల్విన్‌జంక్షన్-మియాపూర్ జంక్షన్-కూకట్‌పల్లి-జేఎన్‌టీయూ..
-గచ్చిబౌలి-ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్-గచ్చిబౌలి స్టేడియం-హెచ్‌సీయూ-నలగండ్ల-బీహెచ్‌ఈఎల్-అల్విన్-మియాపూర్-కూకట్‌పల్లి-జేఎన్‌టీయూ రోడ్డును ఎంచుకోవాలి.
- హైటెక్ సిటీ-సైబర్ టవర్స్-మలేషీయన్ టౌన్-జేఎన్‌టీయూ రోడ్డులో ప్రయాణించే వారు వర్షం కురుస్తున్నప్పడు ప్రత్యామ్నాయంగా..హైటెక్‌సిటీ-కొత్తగూడ-కొండాపూర్-హఫీజ్‌పేట్-అల్విన్-మియాపూర్-కూకట్‌పల్లి-జేఎన్‌టీయూ రూటులో ప్రయాణించి ట్రాఫిక్ రద్దీని నివారించాలి.

భారీగా వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు..
-మాదాపూర్ రోడ్డు నం.45 వైపు వెళ్లే మార్గంలో నెక్టార్ గార్డెన్స్ ప్రాంతం.
-సైబర్ టవర్స్ జంక్షన్ నుంచి నీరూస్, కావూరి హిల్స్ జంక్షన్ రోడ్డు రానుపోను మార్గంలో అయ్యప్ప సొసైటీ సిటీ వైన్స్ ఏరియా.
-సైబర్ టవర్స్ నుంచి హైటెక్స్ మెటల్ చార్మినార్ మార్గంలో శిల్పరామం ప్రాంతంలో..n సైబర్ గేట్‌వే, మైండ్ స్పేస్ రూటులో రహేజా మైండ్‌స్పేస్ అండర్ పాస్ దగ్గర.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...