గురుకుల విద్యార్థులు..మల్లేశం నటులు


Mon,June 24, 2019 04:41 AM

తెలుగుయూనివర్సిటీ : పాఠశాల విద్యకు నిలయాలుగా మారిన సాంఘిక సంక్షేమ గురుకులాలు నేడు చలన చిత్ర పరిశ్రమకు నూతన నటులను అందించే కేంద్రాలుగా మారాయి. సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ప్రారంభించిన విషయం తెలిసిందే. విద్యతో పాటు లలిత కళల కోర్సులలో విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించిన వారి అభివృద్ధికి బాటలు వేయాలనే లక్ష్యంతో మల్కాజిగిరి లలిత కళల పాఠశాలను రాంపల్లిలో 2017లో ఏర్పాటు చేశారు. వీధి నాటకాలు, లఘు చిత్రాలు, ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ తమ సృజనాత్మక ప్రతిభతో రాణిస్తున్న రాంపల్లి పాఠశాల విద్యార్థులు ఇటీవల తెలంగాణ పద్మశాలీలు, చేనేత వర్గాల నేపథ్యంతో రూపొందింన మల్లేశం చిత్రంలో బాల నటులుగా రాణించి సినీ ప్రేక్షకుల ప్రశంసలందుకుంటున్నారు. రాంపల్లి పాఠశాల విద్యార్థులు నిఖిల్, ఎల్లేశ్, శివానంద్, శ్రీ లక్ష్మిల నటన సినీ ప్రముఖులను ఆకట్టుకుంది. మల్లేశం చిత్రంలో గురుకుల విద్యార్థులకు అవకాశం కల్పించిన దర్శకులు ఆర్. రాజ్‌కు ఆ ఘనత దక్కుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు చలచ చిత్ర పరిశ్రమలో కొత్త చరిత్రను సృస్టిస్తూ గురుకుల పాఠశాలల విద్యార్థుల నటనా జీవితానికి బాటలు వేసింది.

మట్టిలో మాణిక్యాలకు వరంగా మారిన గురుకులాలు
విద్యార్థుల ఆసక్తిని, అభిరుచిని పరిగణనలోకి తీసుకొని వారి ప్రతిభను గుర్తించి విద్యార్థులకు కళా రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి పిల్లల ఉత్సాహం మేరకు రంగస్థల కళల విద్యాబోధన సాగుతుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...