తొలకరికే తేలిపోయారు..


Sun,June 23, 2019 06:17 AM

-సహాయ బృందాలున్నా..ఫలితం శూన్యం
-పలు ప్రాంతాల్లో తప్పని ముంపు
-తప్పించుకోలేని ట్రాఫిక్ ఇబ్బందులు
-మొదటి వర్షానికే.. నగరం అతలాకుతలం
-అధిక వర్షపాతమే కారణమన్న అధికారులు
సిటీబ్యూరో, శేరిలింగంపల్లి: మొదటి వర్షానికే నగరం అతలాకుతలమైంది. ఐటీ ప్రాంతంలో తీవ్ర ముంపు సమస్య ఏర్పడి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. జీహెచ్‌ఎంసీ సహా వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన సహాయక బృందాలతో ఫలితం లేకుండా పోయింది. తక్కువ వ్యవధిలో అధిక వర్షం కురవడమే ముంపునకు ప్రధాన కారణమని, శుక్రవారం గంట వ్యవధిలో 10 సెంటీమీటర్లకన్నా అధిక వర్షపాతం నమోదు కాగా, నగరంలో కేవలం రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునే వరదనీటి కాలువలు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తోపాటు జోనల్ కమిషనర్ హరిచందన, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ విశ్వజీత్, డీసీపీ వెంకటేశ్వర్‌రావు, జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు ఇంజినీర్లు శనివారం వరద ప్రాంతాల్లో పర్యటించి ముంపు సమస్యకు గల కారణాలను పరిశీలించారు. కూకట్‌పల్లి, శిల్పారామం, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి చౌరస్తా, రాడిసన్ హోటల్, బయోడైవర్సిటీ జంక్షన్, సుదర్శన్‌నగర్, గబ్చిబౌలీ పోలీస్‌స్టేషన్, ఐకియా, కొండాపూర్, దుర్గంచెరువు తదితర ముంపు ప్రాంతాలను వారు సందర్శించారు. మన రహదారులపై 3.5 సెంటీమీటర్ల వర్షపాతానికి సరపడా డ్రైయిన్ సిస్టమ్ వ్యవస్థ అందుబాటులో ఉందని కమిషనర్ దానకిశోర్ అన్నారు. వర్షం పడ్డ సమయం కూడా సాప్ట్‌వేర్ కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లే రద్దీ సమయ కావడంతో ఇబ్బందులు తలెత్తాయన్నారు. ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, మాన్‌సూన్ బృందాలు సేవలందించినట్లు చెప్పారు.

నీరు నిలిచే క్లిష్టమైన ప్రాంతాలు(27)...
సికింద్రాబాద్ ఓలిఫెంటా బ్రిడ్జి, చిలకలగూడ ఆర్‌యూబీ, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజీ, పంజాగుట్ట మోడల్‌హౌస్, ఖైరతాబాద్ కేసీపీ జంక్షన్, బల్కంపేట్ ఆర్‌యూబీ, జూబ్లీహిల్స్ నీరూస్ షోరూమ్, జూబ్లీహిల్స్ అపోలో క్రెడిల్ హాస్పిటల్, రాణిగంజ్ క్రాస్‌రోడ్స్ బాంబే హోటల్ వద్ద, చిక్కడపల్లి తపాడియా డయాగ్నొస్టిక్ సెంటర్, హిమాయత్‌నగర్ మినర్వా హోటల్, ఖైరతాబాద్ రాజీవ్‌గాంధీ విగ్రహం, లక్డీకాపూల్, అత్తాపూర్ రేతిబౌలీ జంక్షన్, టోలీచౌకి గెలాక్సీ థియేటర్, షేక్‌పేట్ నాలా, ఎన్‌ఎండీసీ మెడివిజన్ ఐ హాస్పిటల్, బంజారాహిల్స్ 1/12 జంక్షన్, నాంపల్లి రైల్వేస్టేషన్ టీ జంక్షన్, బేగంబజార్ పోలీస్‌స్టేషన్ వద్ద, పుత్లీబౌలి రంగమహల్ జంక్షన్, మలక్‌పేట్ ఆర్‌యూబీ, మలక్‌పేట్ గంజ్, మీరాలం ట్యాంక్ దనమ్మ హట్స్ తదితర ప్రాంతాలు.

సైబరాబాద్ పరిధిలో నీరు నిలిచే ప్రాంతాలు(32)
నర్సాపూర్ క్రాస్‌రోడ్, కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్ టీ జంక్షన్, ఎర్రగడ్డ పలక్‌హోటల్, మోతీనగర్ జంక్షన్ మీటర్ ఫ్యాక్టరీ, చింతల్ షా థియేటర్, షాపూర్‌నగర్ రైతుబజార్, జీడిమెట్ల బస్‌డిపో, సూరారం సాయిబాబా టెంపుల్, సూరారం సాయిపూజ థియేటర్, లింగంపల్లి రైల్వే లోవర్ బ్రిడ్జి, చందానగర్ ఖజాన జ్యువెల్లరీ, రామచంద్రాపురం డీ మార్ట్, బీహెచ్‌ఈఎల్ జంక్షన్, ఆల్విన్ హేమదుర్గ టెంపుల్, మియాపూర్ న్యూ కాలనీ, హఫీజ్‌పేట్ బస్‌స్టాప్, హైటెక్స్-శిల్పారామం, సైబర్ గేట్‌వే, అయ్యప్ప సొసైటీ పెట్రోల్‌పంపు, రహేజా ఐటీ పార్క్, హెచ్‌ఎండీఏ నెక్టర్ గార్డెన్, రాఘవేంద్రనగర్ కృతుంగ రెస్టారెంట్, వై జంక్షన్ దోసా అండ్ చెట్నీస్, బాలాజీనగర్ బస్‌స్టాప్, రామ్‌దేవ్ హాస్పిటల్, ఉషా ముళ్లపూడి ఆర్చి, బృందావన్ హోటల్, హైదర్‌నగర్ కావేరీ బార్, ఆరామ్‌ఘర్ క్రాస్‌రోడ్ రైల్వే అండర్‌పాస్, పల్లెచెరువు కల్వర్టు, శంషాబాద్ రైల్వే అండర్ పాస్, కిషన్‌గూడ పైవంతెన.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...