రాంగ్‌రూట్‌తో.. అతలాకుతలం


Sun,June 23, 2019 06:10 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వర్షం కారణంగా సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో నెలకొంటున్న ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణం రోడ్లపై వర్షపు నిలవడం(వాటర్ లాగింగ్ పాయింట్స్)తోనే స్పష్టమవుతుంది. దీనికి తోడు తొందరపాటు, ఆత్రుతతో వాహనాదారులు చేస్తున్న డ్రైవింగ్ మరికొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ వర్షంలో వాహనదారులు క్రమశిక్షణ తప్పి రాంగ్‌రూట్‌లో చేస్తున్న డ్రైవింగ్ రోడ్లపై వాహనాలను నిలిచిపోయే చేస్తున్నాయి. వర్షపు నీరు నిలిచిపోయే పాయింట్‌లను గుర్తించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వారి సహకారంతో దాదాపు 8 పాయింట్‌లను తొలగించిన శుక్రవారం రాత్రి కురిసినా భారీ వర్షానికి ఐటీ కారిడార్ విస్తరించిన గచ్చిబౌలీ, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ, మియాపూర్ ప్రాంతాల్లో దాదాపు 28 చోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో సాధారణ వాహనదారుల రాకపోకలకు గంట నుంచి 4 గంటల వరకు అంతరాయం కలిగింది. మరో వైపు ఈ ప్రాంతాల్లో నడుస్తున్న వివిధ అభివృద్ధి పనుల నేపథ్యంలో అనుకోకుండా వర్షపు నీరు పోయే ఔట్‌లెట్లు మూసుకుపోయాయి. ఇది కూడా కారణంగా ఏర్పడి వర్షపు నీరును రోడ్డు మీద నిలిపివేసింది. ఈ వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో రోడ్డు కుదించుకుపోయి మూడు వాహనాల వరుసలో పోవాల్సిన వాహనాలను సింగిల్ లైన్‌లో ప్రయాణించాయి. అయితే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎమ్.విజయ్‌కుమార్‌లతో పాటు దాదాపు ఐటీకారిడార్‌లోని శాంతి భద్రతలు, ట్రాఫిక్ సిబ్బంది అందరూ రోడ్లపైనే ఉన్నారు. రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మొత్తాన్ని క్లియర్ చేసిన తర్వాతనే ఊపిరి పీల్చుకున్నారు. అయితే గంటల పాటు ట్రాఫిక్ జాం ఏర్పడడంతో ఒక్కసారిగా వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై ఉన్నా ట్రాఫిక్ కదలడం లేదనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టి ట్రాఫిక్ పోలీసులు ఫెయిల్ అంటూ ప్రచారం చేశారు. గంట వ్యవధిలో దాదాపు 10 సెంటిమీటర్ల వర్షం పడడంతో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరును అతి త్వరగా పారబోయడం ఎవరి సాధ్యం కాదనే విషయాన్ని వాహనదారులు మరిచారు. దీనికి తోడు రాంగ్‌లరూట్‌లో వాహనాలను నడిపి ఇబ్బంది పెట్టిన వాహనదారులు కూడా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తుండడం సిబ్బందిని కొంత అసహానానికి గురి చేసింది. 28 చోట్ల నీళ్లు ఆగుతున్నాయి..

శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఐటీ కారిడార్‌లో ఏర్పడిన ట్రాఫిక్ జాం పై శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, జీహెచ్‌ఎమ్‌సీ ఉన్నతాధికారులతో ఇతర విభాగాల అధికారులు సమీక్షించారు. దీంట్లో భాగంగా వర్షపు నీరు నిలిచిన 28 ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ నీరు నిలుస్తున్న కారణాలను అధ్యయనం చేశారు. శాశ్వత పరిష్కారంతో పాటు ఈ వర్షకాలంలో ఈ ప్రాంతాల్లో నీరు నిల్వకుండా తాత్కాలికంగా చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ నేపధ్యంలో గుర్తించిన వర్షపు నీరు నిలిచే పాయింట్‌ల వద్ద ఓ అసిస్టెంట్ ఇంజినీర్ స్థాయి అధికారికి బాధ్యతను అప్పగించనున్నారు. అంతేకాకుండా వర్షపు కాలం ముగిసేంత వరకు ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీరు నిలవకుండా పంప్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంతో పాటు ఈ పనులను ఓ అపరేటర్‌ను నియమించనున్నారు. ఇక శాశ్వత పరిష్కారానికి జేఎన్‌టీయూ ఇంజినీర్‌ల సూచనలను అమలు చేసేందుకు చర్యలను ప్రారంభించారు. దీని కోసం జేఎన్‌టీయూ ఇంజినీర్ల ద్వారా ఓ అధ్యయనం చేయించేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు.

రోడ్డు మధ్యలో ఆటో కోసం..
వర్షపు పడుతున్న సమయంలో ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్‌కు కారణాల పై ఓ ఐటీ ఉద్యోగి పంపిన కారణాలు ఇలా ఉన్నాయి.. ఆటో కోసం రోడ్డు మధ్యలో నిల్చుని వాటిని ఆపడం. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేయడం. ఐఎస్‌బీ, లింగంపల్లి మార్గంలో ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనదారుల అందరూ రాంగ్‌రూట్‌లో వరుస కట్టడం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నేను ఎప్పుడు ఇంత క్రమశిక్షణ తప్పిన మనుషులను చూడలేదంటూ ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పెట్టాడు.

మాదాపూర్ రోడ్డు నెం. 45లో..
వాహనదారులు శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు వర్షం సమయంలో చేసిన గందరగోళ డ్రైవింగ్‌కు సీసీ కెమెరాలు భద్రపర్చిన దృశ్యాలే నిదర్శనం. వాహనదారులు రెండు రోడ్లలను వెళ్లడానికి ఉపయోగించడంతో ఎదురుగా వచ్చే వాహనదారులు ఎటువైపు తెలియక వారు రోడ్డుపైనే నిలిచిపోయారు. ఈ విధంగా వాహనదారులు చేస్తున్న తప్పుడు ట్రాఫిక్ జాంలు సృష్టిస్తున్నాయి.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...