అదిరేటి డ్రెస్సు వేస్తే.. అందం రెట్టింపు!!


Sun,June 23, 2019 06:08 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కాలేజీ లైఫ్.. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. కొత్త పరిచయాలు.. స్నేహాలు.. వేడుకలు.. పార్టీలు.. సెమినార్లు.. ప్రాజెక్టుల టూర్లు.. ఇలా ఒక్కటేమిటీ ఎన్నో అంశాలు కళాశాల కెరీర్‌లో దర్శనమిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో అంశం విద్యార్థుల్లో కొంత టెన్షన్ పుట్టిస్తోంది. అదే డ్రెస్సుల ఎంపిక. ముఖ్యంగా అమ్మాయిలు ఆ విషయంలో చాలా కసరత్తు చేస్తున్నారు. దుస్తుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో ఫ్యాషన్ డిజైనర్లను సైతం సంప్రదిస్తూ ప్రత్యేక దుస్తులను తయారు చేయించుకుంటున్నారు. అందంగా కనిపించాలని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. చూపురులను ఆకర్షించాలని ఫ్యాషన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఇప్పటికే కొన్ని కళాశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇంటర్, డిగ్రీ, ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థినులు వారికి నప్పే దుస్తులను ఎంచుకోవడంలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంలో ఎలాంటి డ్రెస్సులు కొనుగోలు చేస్తే బాగుంటుంది? అనే విషయాలను నిఫ్ట్ విద్యార్థినులు శరణ్య, రాగిని, హిలో ఫ్యాషన్ డిజైనర్ మౌన గుమ్మడి పలు సూచనలు చేశారు.

జీన్స్, టీషర్ట్స్‌కే ప్రాధాన్యం..
విద్యార్థినులు మొదటగా జీన్స్, టీషర్ట్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారికి జీన్స్ బేసిక్ డ్రెస్సుగా మారిపోయాయి. పార్టీ, వేడుకలు ఏవైనా.. జీన్స్‌లో వెళ్లడమనేది సాధరణంగా మారింది. అయితే జీన్స్‌లను చాలా మంది అమ్మాయిలు ధరిస్తుండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవడంలో కొంత వెనుకంజపడుతున్నారని ఫ్యాషన్ డిజైనర్లు చెబుతున్నారు. అయితే జీన్స్‌లో రిఫ్ట్ జీన్స్ లేదంటే టోర్న్ జీన్స్ తీసుకోవడం మంచిదని సూచించారు. మన శరీర ఆకృతిని బట్టి ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. టాప్స్ తీసుకునే సమయంలో వాటిపై ఎక్కువగా డిజైనింగ్ లేకుండా సింపుల్ గా కనిపించినా చాలా ైస్టెలిష్‌గా ఉంటుంది. లాంగ్ గౌన్స్ అందరికి సూట్ అవుతాయి. క్రాప్‌టాప్స్‌ను ఇప్పుడు అమ్మాయిలు చాలా ఎక్కువగా ధరిస్తున్నారు. చూపురులను సూబర్బ్‌గా టీజ్ చేయొచ్చు. స్కిన్‌ఫిట్ ఫ్యాంట్లు అయితే అసమానంగా అంచులను కట్ చేసి ధరిస్తే బాగుంటుంది. అంతేకాకుండా పెప్లంటాప్స్ ముందు వరుసలో ఉంటున్నాయి. బాటమ్ ఏదైన అంటే షార్ట్స్, చిక్ ప్యాట్స్, స్కర్ట్స్ అన్నిటి మీద ఇది బాగా నప్పుతుంది. ఇందులో విభిన్న రకాల స్లీవ్‌లెస్‌లు ప్రత్యేక ఆకర్షణతో పాటు... ధరించిన వారికి అదనపు అందాన్నిస్తాయి.

ఫ్యాషన్ డిజైనర్ల వద్దకు విద్యార్థినులు!
కాలేజీ లైఫ్‌లో అమ్మాయిలకు ఏ రోజుకు ఆరోజు కొత్తదినమే. రోజు కొత్తగా కనిపించాలని ఆరాట పడుతారు. రేపు ఏ డ్రెస్సు వేసుకోవాలి? మ్యాచింగ్ ఎలా ఉండాలి? ఫుట్ వెయిర్ నుంచి ఇయర్ రింగ్స్ వరకు ఆలోచిస్తారు. ముఖ్యంగా ప్రస్తుతం అమ్మాయిలు ఎక్కువగా వెస్టర్న్ స్కర్ట్స్, షార్ట్స్,లాంగ్‌డ్రెస్సెస్, ఫ్యాన్సీ డ్సెస్సెస్‌ను పార్టీలలో ధరించడానికి బాగుంటాయని నిఫ్ట్ కాలేజీ విద్యార్థిని శరణ్య తెలిపారు. చాలా రకాల డిజైన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇంకా వెరైటీవి కావాలనుకునే వారు ఫ్యాషన్ డిజైనర్లను సంప్రదిస్తే వారికి నచ్చిన విధంగా డిజైన్ చేసి పెడతారని రాగిని సూచించారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థినులు ఫ్యాషన్ డిజైనర్లకు తమ దుస్తులకు సంబంధించిన వర్క్‌ను అప్పజెప్పారని తెలిపారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...