సైకో వీరంగం...


Sun,June 23, 2019 06:06 AM

మెహిదీపట్న : మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. శనివారం తెల్లవారు జామున సైకోగా మారి పజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశాడు. 9 ద్వి చక్ర వాహనాలకు నిప్పు పెట్టి , వాటిని దహనం చేశాడు. ఈ సంఘటన హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి అఫ్జల్‌సాగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లేపల్లి అఫ్జల్‌సాగర్, దోభీఘాట్ ప్రాంతంలో నివసించే మహ్మద్ గౌస్ ఖాద్రీ అలియాస్ మెంటల్ గౌస్(32) మానసిక స్థితి సరిగ్గా లేదు. కొన్ని రోజులుగా ఇం ట్లోవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఈ మేరకు కుటుంబ సభ్యులు హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వెళ్లగా దొరకలేదు. కాగా... శనివారం తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతంలో తన ఇంటి సమీపంలోని చౌరస్తా పరిసర ప్రాంతాల్లో సుమారు 9 బైకులను తగులబెట్టాడు. దీంతో చుట్టు పక్కల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మహ్మద్‌గౌస్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...