ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్సీలకు ఉచిత విద్య..


Sun,June 23, 2019 06:06 AM

-ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు లబ్ధిదారుల ఎంపిక
మేడ్చల్ కలెక్టరేట్: ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం లబ్ధిదారుల ఎంపిక పక్రియను ఈ నెల 25 నుంచి నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. శ్యామసుందరి ఒక ప్రకటనలో తెలిపారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం,కూకట్‌పల్లి,బాలానగర్,బాచుపల్లి,దుండిగల్ గండిమైసమ్మ లబ్ధ్దిదారుల ఎంపికను 25న మున్సిపాలిటీ కార్యాలయం కుత్బుల్లాపూర్. ఈ నెల 27న మేడ్చల్ రూరల్, మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయం మేడ్చల్. జూలై 2న ఉప్పల్,మేడిపల్లి,పీర్జాదిగూడ,బోడుప్పల్ పరిధిలోని లబ్ధ్దిదారులు జీహెచ్‌ఎంపీ సర్కిల్ కార్యాలయం ఉప్పల్. జూలై 4న అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి పరిధిలోని లబ్ధ్దిదారులు జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయం మల్కాజిగిరి. జూలై 6న ఘట్‌కేసర్, కీసర,శామీర్‌పేట్ మండలాల పరిధిలోని లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయం కీసరలో ఎంపీకను నిర్వహిస్తున్నట్ల ఈడీ పేర్కొన్నారు. దరఖాస్తు దారులు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ,కులధ్రువీకరణ పత్రాలు, ఏవైన శిక్షణలో అనుభవం ఉన్నచో దానికి సంబంధించిన పత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని తెలిపారు. ఇతర వివరాల కోసం మేడ్చల్ కలెక్టరేట్ బిబ్లాక్‌లోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...