ఒడిశా బాలకార్మికులకు విముక్తి..


Sat,June 22, 2019 12:48 AM

- తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు అభినందనలు
- మరింత పెరిగిన తెలంగాణ పోలీస్ ప్రతిష్ట
-హర్షం వ్యక్తం చేసిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బాలకార్మికులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేసి ఇతర రాష్ర్టాల పిల్లలకు వారి మాతృభాషలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం విద్యాబుద్ధులు చెప్పిస్తుండడంతో అభినందనీయమని యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ), డిపార్టుమెంట్ అఫ్ స్టేట్స్‌కు సంబంధించి 2019 ట్రాఫికింగ్‌పై విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీంతో తెలంగాణ పోలీసుల ప్రతిష్ట మరిం త పెరిగింది. ఒడిశా రాష్ట్రం నుంచి వలస వచ్చిన కార్మికులు, వారి పిల్లలను కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇటుకబట్టీల్లో పనిచేయిస్తున్నారు. ఇటుకబట్టీలు, రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకునే పిల్లలు, ఇతర కార్మాగారాల్లో పనిచేసే పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి స్పెషల్ డ్రైవ్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నిర్వహించారు.

బాలలకు నిర్భంద విద్య తప్పని సరే అనే విషయాన్ని వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పట్టుబడిన పిల్లలకు విద్యాబుద్ధ్దులు చెప్పిస్తున్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి, గతంలో అమెరికాకు చెందిన సంస్థల నుంచి కూడా అవార్డులు పొందారు. చేరదీసిన బాలలకు విద్య అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్ల సహకారం తీసుకుంటున్నారు. పట్టుబడుతున్న పిల్లలకు ఎక్కువగా ఒడిశా రాష్ర్టానికి చెందిన వారే ఉండడంతో ఈ విషయాన్ని రాచకొండ సీపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి వారి సహకారంతో ప్రత్యేక ఒడిశా బాషాను చెప్పే విధంగా 8 పాఠశాలలు ప్రారంభించి, అందులో 870 మంది విద్యార్థులకు విద్యా బోధిస్తున్నారని ఆమెరికా స్టేట్స్ తన నివేదికలో పేర్కొంది. దీనిపై రాచకొండ సీపీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అమెరికా ప్రస్తావించడం ఆనందంగా ఉందన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...