యోగాతో మంచి ఆరోగ్యంమంత్రి తలసాని


Sat,June 22, 2019 12:48 AM

కేపీహెచ్‌బీ కాలనీ : నిత్యం యోగా సాధన చేయడం వల్ల మంచి ఆరోగ్యవంతులుగా జీవిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ రమ్యాగ్రౌండ్‌లో అందరికీ ఆరోగ్యం యోగా కేంద్రం గురూజీ ఆర్.ఎస్.ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి తలసాని, సువర్ణ భూమి ఎండీ బొల్లినేని శ్రీధర్ పాల్గొని మాట్లాడారు. యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, శారీరక రెట్టింపు శక్తి పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగా సాధన భాగం కావాలని సూచించారు. కార్యక్రమంలో గౌతమ్ మోడల్ స్కూల్, భాష్యం, చైతన్య, పాఠశాలల విద్యార్థులు, యోగా టీచర్లు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...