తెలంగాణ పిండి వంటలతో ఆరోగ్యం


Fri,June 21, 2019 01:13 AM

కవాడిగూడ, నమస్తే తెలంగాణ: పోషక విలువలు ఉండే పప్పు దినుసులతో తయారు చేసే తెలంగాణ పిండి వంటలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్(టీఎస్‌టీడీసీ) పన్యాల భూపతిరెడ్డి చెప్పారు. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ పిండి వంటలకు దేశంలోనే మంచి చరిత్ర ఉందన్నారు. ట్యాంక్‌బండ్ హరిత రెస్టారెంట్‌లో నాచారం శ్రీదేవి స్వగృహఫుడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పిండి వంటకాల స్టాల్‌ను భూపతిరెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంప్రదాయాలు చాలా గొప్పవని, ఒక్కో పండుగకు ఒక్కోరకమైన పిండి వంటలు చేసుకుంటారని గుర్తుచేశారు. ప్రస్తుత యాంత్రిక యుగంలో ఒకరినొకరు కలువడమే కష్టంగా మారిందని, పిల్లలకు పిండి వంటకాల గురించి తెలియకుండాపోతున్నదని తెలిపారు. తెలంగాణ పిండి వంటకాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాలని, ఇందుకు ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నదన్నారు. తెలంగాణ పిండి వంటకాలకు ప్రత్యేకత ఉందని, అందుకే విదేశీయులు సైతం వీటిని ఆర్డర్‌పై తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. మన వంటకాల ద్వారా అనేక మందికి ఉపాధి దొరుకుతుందని, చిన్న పరిశ్రమగా దీన్ని కొనసాగించవచ్చని సూచించారు. టీఎస్‌టీడీసీ ఎండీ బీ మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ పిండి వంటకాలకు మంచి చరిత్ర, ఆదరణ ఉందన్నారు. పెండ్లీళ్లు జరిగితే పిండి వంటకాలను ఆడపడుచుతో సారెగా పంపేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.సురేందర్, డి.వేణు, పురేందర్ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...