ప్రపంచ దేశాలు యోగాను


Thu,June 20, 2019 12:36 AM

-ఆరోగ్య ప్రదాయినిగా ఆచరిస్తున్నాయి
-రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో డైరెక్టర్ దేవేంద్ర
అబిడ్స్, నమస్తే తెలంగాణ : యోగా మన జీవన విధానం, భారతీయ ప్రాచీన సంస్కృతికి ప్రతీక, ప్రపంచ దేశాలు యోగాను ఒక ఆరోగ్య ప్రదాయినిగా గుర్తించి ఆచరిస్తున్నాయని రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో డైరెక్టర్ ఎం. దేవేంద్ర పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని రీజినల్ అవుట్ రీచ్ బ్యూరోకు చెందిన సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఉద్యోగులు జూన్ 21న నిర్వహించే ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రీ పబ్లిసిటీ క్యాంపెయిన్‌లో భాగంగా బుధవారం వనితా మహా విద్యాలయం ప్రాంగణంలో యోగాపై కళాప్రదర్శన అత్యద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఉరుకుల పరుగుల మనిషి జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతుందని, తీవ్ర ఒత్తిడికి గురై జీవనం సాగిస్తున్నామన్నారు. అనంతరం కళాకారులు తమ ప్రదర్శనలో ఎంతో గొప్ప సందేశాన్ని విద్యార్థులకు అందించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ భారతీలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ శోభన, వైస్ ప్రిన్సిపాల్ ఆర్తిసిన్హా, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొని ఈ కళా ప్రదర్శనను విజయవంతం చేశారు. డాక్టర్ విజయ్, డాక్టర్ రవీంద్ర, రంగన్న, శ్రీధర్, రామకృష్ణ, డాక్టర్ శారదా, మృణాళిని, రాజు కళాకారులుగా పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...