ఇంట్లో భారీగా గుట్కా నిల్వ


Thu,June 20, 2019 12:24 AM

-పోలీసుల దాడి.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
-రూ.2.10లక్షల గుట్కాలు స్వాధీనం
-చౌదరిగూడలో ఘటన
ఘట్‌కేసర్ : నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచి, విక్రయిస్తున్న ఓ ఇంటిపై ఘట్‌కేసర్ పోలీసులు దాడిచేశారు. ము గ్గురు వ్యక్తులను అదు పులోకి తీసుకుని, రూ.2.10లక్షల విలువగల గుట్కా లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కుమవత్ రావ్నివాస్ (22), కుమవత్ చంపాలాల్ (32), కుమవత్ ముఖేశ్ (22)లు చౌదరిగూడ పంచాయతీ యాదాద్రి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరు గుట్కాల దందా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారీగా గుట్కాలను ఇంట్లోనే నిల్వ ఉంచి.. విక్రయాలు జరుపుతున్నారు. సమాచారం అందు కున్న ఎస్సై విజయ కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై దాడి చేశారు. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నా రు. అక్కడి నుంచి మిరాజ్ టొబాకో , ఆర్‌ఆర్ గుట్కా, విమల్ గుట్కా, స్వాగత్, చైనీ, అంబర్, సాగర్, రాజా టొబాకో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.2.10లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే వారి నుంచి రూ.1.6లక్షల నగదు, ఆక్టివాను స్వాధీనం చేసుకున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...