సైకిల్‌పై భారత యాత్ర


Wed,June 19, 2019 12:58 AM

-ఐదు పదుల వయస్సులో సాహసం
-18 నెలల్లో 30వేల కిలోమీటర్ల ప్రయాణం
ఖైరతాబాద్‌, జూన్‌ 18 : జాతీయ సమగ్రత, దేశభక్తి, విశ్వశాంతి, గోరక్ష, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి పొదుపును కాంక్షిస్తూ ఐదు పదుల వయస్సులో ఓ వ్యక్తి దేశ వ్యాప్త సైకిల్‌ యాత్రకు శ్రీకారం చుట్టారు. కర్నాటక రాష్ట్రంలోని హసన్‌ జిల్లాకు హెచ్‌ఎన్‌ నాగరాజు గౌడ్‌ 2017 డిసెంబర్‌ 3న తన స్వగ్రామం నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. వివిధ రాష్ర్టాలు ప్రయాణిస్తూ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వద్ద తన యాత్ర విశేషాలను మీడియాకు వివరించారు. కర్నాటక నుంచి ప్రారంభమైన యాత్ర వివిధ జిల్లాలు, మండలాలు, గ్రామాల మీదుగా ప్రయాణిస్తూ ముంబయి, గుజరాత్‌, రాజస్తాన్‌, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖాండ్‌, ఢిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ల మీదుగా మంగళవారం తెలంగాణ రాష్ర్టానికి చేరుకున్నదని తెలిపారు. పగటి పూట రోజుకు 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తూ రాత్రి వేళల్లో ప్రార్థనా మందిరాలు, ఆశ్రమాల్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలకు ఐక్యమత్యం, దేశభక్తి, విశ్వశాంతి, గోరక్షణ, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి పొదుపు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. తెలంగాణ నుంచి కర్నూల్‌, అనంతపూర్‌ మీదుగా తన స్వగ్రామానికి చేరుకుంటానని తెలిపారు. ఇప్పటి వరకు 30వేల కిలోమీటర్లు ప్రయాణించానని తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...