ఎంపీ ల్యాడ్స్‌కు ఓకే..


Tue,June 18, 2019 04:06 AM

సిటీబ్యూరో: లోక్‌సభ సభ్యులు తమ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఉద్దేశించినవే ఎంపీ ల్యాడ్స్‌ నిధులు. ఎంపీలు తమ విచక్షణ మేరకు అభివృద్ధి చేసుకునేందుకు వీలు కల్పించే ఈ నిధులతో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌ కాల పరిమితి ముగిసిన నేపథ్యంతో గత పార్లమెంట్‌ కాలంలో మంజూరైన ఈ నిధులను మరో 20 మాసాల పాటు ఖర్చు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించి, మంజూరైన వాటిని 20 మాసాల పాటు కొనసాగించుకునే వీలుంది. 16వ పార్లమెంట్‌ కాల పరిమితి ముగిసి, సోమవారం కొత్త పార్లమెంట్‌ కొలువుదీరిన విషయం తెలిసిందే. అయితే కాల పరిమితి ముగిసినా ఎంపీ ల్యాడ్స్‌తో మంజూరైన పనులను 20 మాసాల పాటు కొనసాగించే వీలుంది.

జిల్లాలో రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలుండగా ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్‌ నుంచి అసదుద్దీన్‌ ఓవైసీ మళ్లీ ఎన్నిక కాగా, సికింద్రాబాద్‌ నుంచి బండారు దత్తాత్రేయ స్థానంలో అదే పార్టీకి చెందిన కిషన్‌రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. గత లోక్‌సభ కాలంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిని జిల్లాలో రోడ్డు, పైపులైన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు ఖర్చు చేశారు. ఎంపీలు ప్రతిపాదనలు పంపడం, ఎగ్జిగ్యూటివ్‌ ఏజెన్సీల నుంచి అంచనాలు రూపొందించడం, మంజూరీలు జారీ చేయడం జరిగినా, నిధులు మంజూకాకపోవడంతో కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ఈ పనులను 18 మాసాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రోజులను మినహాయిస్తారు. ఈ ఏడాది రెండు మాసాల పాటు కోడ్‌ అమల్లో ఉండడంతో మొత్తం 20 మాసాల పాటు పనులను కొనసాగించుకునే అవకాశం ఏర్పడింది.

రెండు ఇన్‌స్టాల్‌మెంట్లుగా..
జిల్లాలో ఎంపీ ల్యాడ్స్‌ నిధుల వినియోగంలో నిధులను ఏక మొత్తంలో ఇవ్వకుండా రెండు వాయిదాలుగా విభజించి ఖర్చు చేస్తున్నారు. మొదట పరిపాలనపరమైన అనుమతులిచ్చిన తర్వాత, రెండో విడుతలో టెక్నికల్‌ అనుమతులిచ్చి మొదటి దఫా నిధులను విడుదల చేసేలా మార్పులు చేశారు. ఎగ్జిగ్యూటివ్‌ ఏజెన్సీలైన తహసీల్దార్లు, జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, కంటోన్మెంట్‌ బోర్డుల నుంచి ప్రతిపాదనలకు ఫీజుబులిటీ రిపోర్ట్‌ రాగానే ఫైనల్‌ అప్రూవల్‌ తీసుకుని టెక్నికల్‌ అనుమతులను జారీ చేస్తున్నారు. టెక్నికల్‌ అనుమతులు రాగానే మొదటి విడుత నిధులు, పనులు పూర్తికాగానే యూటిలిటీ సర్టిఫికెట్‌లను సేకరించి, రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ నిధులు మంజూరు చేసేలా మార్పులు చేశారు.
-2016 -17 సంవత్సరానికి కేవలం రూ. 2.5 కోట్లను మాత్రమే ఎంపీ ల్యాడ్స్‌గా ప్రభుత్వం కేటాయించింది. ఇలా రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సగం నిధులు మాత్రమే వచ్చాయి.
-2017 -18, 2018 -19 ఆర్థిక సంవత్సరాలకు సంవత్సరానికి రూ. 5 కోట్ల చొప్పున 10 కోట్లు రావాల్సి ఉండగా, ఒక్కరూపాయి విడుదల కాలేదు. కానీ ప్రతిపాదనలు స్వీకరించడం, వాటిని ఆమోదించడం, టెండర్లు పూర్తిచేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పనులు సైతం ప్రారంభమయ్యాయి.20 మాసాల కాల పరిమితి ఉండడంతో, ప్రభుత్వం వాయిదాల రూపంలో నిధులను విడుదల చేయనున్నది.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...