పేదింట విరిసిన సరస్వతీ కుసుమమం


Mon,June 17, 2019 03:44 AM

శంషాబాద్: సాధించాలనే లక్ష్యం ఉంటే...ఏ అడ్డంకులు ఏమి చేయలేవు. హఠాత్తుగా తండ్రి మరణం...అంతు లేని ఆవేదన... అతిదగ్గరలో పరీక్షలు... అయినా గుండెనిండిన బాధలోను తన లక్ష్యం కోసం అహోరాత్రులు ఆ చదువుల తల్లి ఆరాటం పడింది. 10 వ తరగతిలో జీపీఏ ర్యాంక్ సాధించి బాసర ట్రిపుల్‌ఐటీకి తొలి ఎంపికలోనే స్థానం సాధించి ప్రతిభను చాటుకుంది ఆ చదువుల కుసుమం. వివరాలు...శంషాబాద్ మండలం పాలమాకులలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల నుంచి ట్రిఫుల్ ఐటి ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు ఎంపికైన ఏకైక విద్యార్థిని ఎల్. సుప్రజ. ఆమె స్వస్థలం శంషాబాద్ మండలం చినగోల్కొండ. తల్లిదండ్రులు నర్సింహ, జయ మ్మ. తండ్రి ఎల్. నర్సింహ గ్రామస్థాయి తాత్కాలిక పోస్టల్ డిపార్టుమెంట్ ఉద్యోగిగా పనిచేసేవాడు. కాగా హఠాత్తుగా గత ఫిబ్రవరి మాసంలో అనారోగ్యంతో అకాలమరణం చెందాడు. ఒక్కసారి సుప్రజ గుండె గాయమైంది. వీరు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఒక తమ్ముడు. తల్లి జయమ్మ గ్రా మంలో అంగన్‌వాడి టీచర్. తనను ఎంతో ఉన్న త శిఖరాలధిరోహించాలని కలలు కన్న తండ్రి మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. గుండలవిసే బాధలు దిగమింగుకుంది. మరో నెలలో పదవ తరగతి పరీక్షలు. పట్టుదలతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అహోరాత్రుల కఠోర శ్రమ ఫలించింది. 10 వ తరగతిలో 9.8 జీపీఏ ర్యాంక్ వచ్చింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఐఐటీకి ఎంపికైన 1600 మందిలో తొలిఎంపిక లోనే పాఠశాల నుంచి సుప్రజ ఎంపికైనది. చిన్నప్పటి నుంచి కూడా అన్నింటిలోను ఫస్ట్ . ఈ మేరకు ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.

పేదల కుటుంబాలకు వరం మోడల్‌స్కూల్స్
- ప్రిన్సిపాల్ విష్ణుప్రియ.
తెలంగాణ ప్రభుత్వం కల్పించిన మోడల్స్ స్కూ ల్స్ వ్యవస్థ పేద కుటుంబాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివే సువర్ణావకాశం కల్పించడం వరం. వ్యయప్రయాసలతో వారు సాధించలేని సదవకాశం మోడల్స్ స్కూల్స్ తీరుస్తున్నాయి. ఉచిత శిక్షణ, ఉచిత విద్యాబోధన, వసతి సదుపాయాలు కల్పించి విద్యార్థులను అన్ని విధాల తీర్చిదిద్దడం జరుగుతున్నాయి.

చాలా ఆనంగా ఉంది.. సుప్రజ
ట్రిపుల్ ఐటీలో స్థానం సాధించడం చాలా ఆనం దగా ఉంది..కాని నాన్న ఆనందం చూడలలేదని బాధ. నా విజయం, లక్ష్యసాధన వెనుక మా నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. నన్ను మోడల్‌స్కూల్‌లో చేర్పించి వెన్నంటి నిలిచారు. హఠాత్తుగా మరి కొద్దిరోజులలో లక్ష్యం తీరేలోపే నాన్న హఠాన్మరణం నాకు తీరనిలోటు. నాన్న ఆశయం కోసం మరింత కష్టపడి ప్రతిభతో ఉన్నతస్థానాన్ని పొందుతాను. భవిష్యత్‌లో మంచి సాఫ్ట్‌వేర్ కావాలన్నదే ఆశయం.నా కుటుంబానికి ఆసరాగా నిలు స్తాను. నా లక్ష్యసాధనలో ఉపాధ్యాయుల సహకారం ఎంతో ఉంది. వారికి నా కృతజ్ఞతలు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...